సంప్రదాయ వస్త్రాలు ధరిస్తేనే అప్పన్న దర్శనం
ABN , Publish Date - Nov 07 , 2026 | 07:07 AM
సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఇకపై సంప్రదాయ దుస్తులనే ధరించాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు కోరారు.
సింహాచలం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఇకపై సంప్రదాయ దుస్తులనే ధరించాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు కోరారు. ఈ నెలాఖరు నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నామని శుక్రవారం ప్రకటించారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ, దైవం పట్ల భక్తిప్రపత్తులు చాటుకునేందుకు వీలుగా భక్తులంతా ఆలయ మర్యాదలను అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News