Share News

ఆ విషయంలో నా కుమార్తె సుస్మిత ఎవర్నీ వదలిపెట్టదు: కొండా మురళీ

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:04 PM

మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ మంత్రి కొండా సురేఖ భర్త మురళీ కీలక వ్యాఖ్యలు చేశారు. పరకాల తమ అడ్డా... వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచే కొండా సురేఖ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

ఆ విషయంలో నా కుమార్తె సుస్మిత ఎవర్నీ వదలిపెట్టదు: కొండా మురళీ
Konda Murali

వరంగల్, మార్చి 4(ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ మంత్రి కొండా సురేఖ భర్త మురళీ (Konda Murali) కీలక వ్యాఖ్యలు చేశారు. పరకాల తమ అడ్డా... వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచే కొండా సురేఖ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఇవాళ(బుధవారం) గీసుగొండ మండలంలోని కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరలో కొండా మురళీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తన బిడ్డా కొండా సుస్మిత ఎవరినైనా ఎదిరిస్తుందని చెప్పుకొచ్చారు. తనకన్నా కొండా సుస్మిత ధైర్యవంతురాలని తెలిపారు. కార్యకర్తలకు సమస్య వస్తే ఎవర్నీ వదలిపెట్టదని అన్నారు. ఎంతటివారినైనా ధైర్యంగా ఎదుర్కొంటుందని కొండా మురళీ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇఫ్తార్ మాదిరిగా హిందువులకు ప్రత్యేక కార్యక్రమాలేవి: రాజాసింగ్

రాహుల్ గాంధీకి.. మందకృష్ణ లేఖ.. ఎందుకంటే..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 04 , 2026 | 01:45 PM