భూపాలపల్లిలో దారుణం.. టిప్పర్ ఢీకొట్టడంతో ఆర్టీవో మృతి
ABN , Publish Date - Jun 22 , 2026 | 10:23 AM
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం చెల్పూరులో వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలో ఆర్టీవో వెంకన్నపై లారీ దూసుకెళ్లడంతో మృతిచెందారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం చెల్పూరులో వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలో ఆర్టీవో వెంకన్నపై లారీ దూసుకెళ్లడంతో మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఏం జరిగిందంటే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చెల్పూరులోని ఆర్టీవో కార్యాలయం ఎదుట ఆర్టీవో వెంకన్న వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో తాడిచర్లలోని ఎంఏఆర్ఎల్‌కు సంబంధించిన టిప్పర్‌ను ఆపే ప్రయత్నం చేయగా, డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని ముందుకు నడిపాడు. దీంతో టిప్పర్ నేరుగా వెంకన్నను ఢీకొట్టి, ఆయనపై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వెంకన్నను స్థానికులు, సహచరులు వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆస్పత్రికి చేరుకునేలోపే ఆయన మృతి చెందారు. ఈ టిప్పర్ ఓనర్ పెద్దపల్లి ఏరియాకి చెందిన ఖలీల్‌ఖాన్‌గా పోలీసులు గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆరోగ్యానికి యోగానే ఉత్తమ మార్గం: బండి సంజయ్
ఆరోగ్య తెలంగాణకు యోగానే మార్గం: మంత్రి పొన్నం ప్రభాకర్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News