Share News

పచ్చిమిర్చిపై సిండికేట్‌ మచ్చ

ABN , Publish Date - May 30 , 2026 | 01:47 PM

వరంగల్‌ కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులు సిండికేట్‌ అయ్యారు. వారు చెప్పిందే వేదం.. వారి మాటే శాసనం అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

పచ్చిమిర్చిపై సిండికేట్‌ మచ్చ
Green Chilli Prices

  • వరంగల్‌ మార్కెట్‌లో వ్యాపారుల ఇష్టారాజ్యం

  • మాముళ్ల మత్తులో అధికారులు

  • బేజారవుతున్న వినియోగదారులు

వరంగల్‌ సిటీ: వరంగల్‌ కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులు సిండికేట్‌ అయ్యారు. వారు చెప్పిందే వేదం.. వారి మాటే శాసనం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రశ్నించాల్సిన అధికారులు మౌనం వహిస్తుండడంతో రేట్లు పెంచి దోపిడీకి పాల్పడుతున్నారు. బయటి మార్కెట్‌ కంటే రూ.10 నుంచి రూ.20వరకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.


వరంగల్‌ కూరగాయల మార్కెట్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతీరోజు పెద్ద ఎత్తున పచ్చిమిర్చి దిగుమతి అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల నుంచి రోజుకు 30 నుంచి 40 టన్నుల పచ్చి మిర్చి వస్తుంది. వారి దగ్గర హోల్‌సేల్‌గా కొనుగోలు చేసిన వ్యాపారులు సిండికేట్‌ అయి రిటైల్‌గా ఎక్కవ ధరకు అమ్ముతున్నారు. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి, బాటసింగారం, సిద్దిపేటలోని ఒంటిమామిడి మార్కెట్‌లో కిలో మిర్చి రూ.40 దొరికితే ఇక్కడ మాత్రం రూ.60కి అమ్ముతూ దోపిడీకి పాల్పడుతున్నారు.


xxxxx.jpgయాప్‌లలో మాత్రం తక్కువ ధరలే..

వ్యవసాయ మార్కెట్‌ యాప్‌లలో మాత్రం పచ్చి మిర్చి ధర రూ.20 నుంచి 40 వరకే చూపిస్తున్నా రు. అమ్మకాలు మాత్రం అందుకు డబుల్‌ రేట్‌ చెబుతున్నారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే ‘మేం అలాగే అమ్ముతాం.. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని చిరు వ్యాపారులను బెదిరిస్తున్నారు.


పచ్చిమిర్చి ధరలు పెరిగాయి

  • కె. కుమార్‌, వినియోదారుడు

పచ్చిమిర్చి ధరలు ఈ మధ్య బాగా పెరిగాయి. బయటి మార్కెట్ల కంటే ఇక్కడి మార్కె ట్లో ఎక్కువ ఉన్నాయి. వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసే పచ్చిమిర్చి ధరలను అధికారు లు కట్టడి చేయాలి. ఇష్ట్టారీతిన పెంచకుండా తగు చర్యలు తీసుకోవాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

బ్రో... జాగ్రత్త..! సోషల్‌ మీడియాలో రెచ్చగొడితే జైలుకే

15 ఏళ్లు దాటిన పురుషుల్లో 44శాతం మద్యం ప్రియులే

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 30 , 2026 | 01:47 PM