Share News

బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అరెస్ట్

ABN , Publish Date - May 30 , 2026 | 01:16 PM

బీఆర్ఎస్ పార్టీ కీలక నేత బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బాల్క సుమన్‌ను నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు.

బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అరెస్ట్
Balka Suman arrested

హైదరాబాద్, మే 30: బీఆర్ఎస్ పార్టీ కీలక నేత బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బాల్క సుమన్‌ను నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు.


null

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారు: బాల్క సుమన్

పోలీసులు అరెస్ట్ చేయడానికి ముందు బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను ఎక్కడికీ పారిపోలేదు. తెలంగాణ భవన్‌లోనే ఉన్నా. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నాపై 250కి పైగా కేసులు పెట్టారు. క్యాతనపల్లి ఎన్నిక సమయంలోనూ నన్ను జైల్లో పెట్టారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రశ్నిస్తూనే ఉంటాం. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. దానినే ప్రశ్నించా. మరోసారి నన్ను జైలుకు పంపాలని రేవంత్, వివేక్ ప్రయత్నిస్తున్నారు. నన్ను జైలుకు పంపి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రశ్నిస్తూనే ఉంటాం’ అని అన్నారు.


బాల్క సుమన్‌పై నమోదైన ఎఫ్ఐఆర్‌లో వివరాలు..

బాల్క సుమన్‌పై 326(g), 351(3), 353(1)(b), r/w55, r/w 61(2)(a), bns 4 pdppa కింద కేసు నమోదైంది. ఆనంద్ అనే వ్యక్తి బాల్క సుమన్‌పై నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బొగ్గు గని కార్మికుల సమావేశంలో బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ‘సింగరేణిని తగలపెట్టండి. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ఆఫీస్‌లను తగలబెడదాం. నెల రోజులు జైలుకు పోయి వస్తాము’ అని బాల్క సుమన్ కామెంట్లు చేసినట్లు ఆనంద్ తెలిపాడు.


ఇవి కూడా చదవండి

వైఎస్ వివేకా కుమార్తె సునీత పోరాటంలో న్యాయం ఉంది: సీఎం చంద్రబాబు

మండల పాయింట్లకు పాఠ్యపుస్తకాలు

Updated Date - May 30 , 2026 | 01:54 PM