నా‘నో’ అంటున్న రైతులు
ABN , Publish Date - Aug 12 , 2026 | 01:01 PM
నానో యూరియా, నానో డీఏపీ వినియోగించడంలో రైతులు అంతగా ఆసక్తి చూపడం లేదు.
నానో ఎరువుల వినియోగంలో అనాసక్తి
గుళికల యూరియానే వినియోగిస్తున్న రైతులు
నానోపై అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం
నర్మెట(జనగామ): నానో యూరియా, నానో డీఏపీ వినియోగించడంలో రైతులు అంతగా ఆసక్తి చూపడం లేదు. నానో(ద్రవరూపం)పై సరైన అవగాహన లేకపోవడంతో, చైతన్య పర్చడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. దీంతో గుళికల రూపంలో ఉన్న యూరియా, డీఏపీ వినియోగానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. రైతులపై భారం తగ్గించేందుకు కేంద్రం నానో ఎరువులను అందుబాటులోకి తీసుకువచ్చింది. నానో ఎరువులు వాడాలని అధికారులు చెప్తున్నా, వాటి వినియోగంతో కలిగే లాభాలను రైతులకు వివరించకపోడంతో విఫలమవుతున్నారు. గుళికలుగా ఉన్న యూరియా, డీఏపీనే ఎక్కువగా వినియోగిస్తున్నారు.
బస్తాలకే మొగ్గు...
నానో లిక్విడ్ యూరియా, డీఏపీ మార్కెట్‌లో తక్కువ ధరకే దొరుకుతున్నా అన్నదాతలకు నమ్మకం కుదరడం లేదు. క్షేత్రస్థాయిలో సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. నానోతో రవాణా చార్జీలు తగ్గించడంతో పాటు రహదారి సౌకర్యం లేని గ్రామీణ ప్రాంతాలకు సులువుగా తరలించవచ్చు. యూరియా బస్తా రూ. 267అందిస్తోంది. బహిరంగ మర్కెట్లో రూ. 310 నుంచి రూ.350 వరకు అమ్ముతున్నారు. ఇంటికి తీసుకురావడానికి అదనంగా ఖర్చు అవుతుంది.
అదే నానో యూరియా 500 మిల్లీలీటర్ బాటిల్ ధర మార్కెట్లో రూ. 225 నుంచి రూ.250 లభిస్తుంది. అది ఎకరాకు సరిపోతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం డీఏపీ బస్తాను రూ.1,350 కి విక్రయిస్తుండగా మార్కెట్లో కొందరు రూ. 1,450 నుంచి రూ.1,800 వరకు విక్రయించిన సందర్భాలున్నాయి. నానో డీఏపీ లీటర్ ధర రూ.595 దొరుకుతుంది. సాధారణ ఎరువు బస్తాలు అయితే మోయాల్సి ఉంది. అదే నానో ఎరువులు సీసాల రూపంలో ఉండడంతో సులభంగా తీసువెళ్లవచ్చని అధికారులు చెబుతున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం..
సుంకరి జగదీష్, ఏఈవో నర్మెట
నానో ఎరువుల వినియోగంతో కలిగే ప్రయోజ నాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. బ స్తాల యూరియా, డీఏపీలు ఎలా పనిచేస్తాయో నానో ఎరువులు వాటికంటే మెరుగైన ప్రయోజనాలే ఇస్తాయి. రైతులు బస్తాల యూరియాకు బదులుగా నానో యూరియా వాడాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
బాల్యంలో లైంగిక దాడి.. 15 ఏళ్ల తర్వాత సవతి సోదరుడిపై యువతి కేసు..
వికారాబాద్ జిల్లాలో నకిలీ డీఏపీ కలకలం.. ఆందోళనలో రైతులు
Read Latest AP News And Telangana News And International News And Telugu News