బాల్యంలో లైంగిక దాడి.. 15 ఏళ్ల తర్వాత సవతి సోదరుడిపై యువతి కేసు..
ABN , Publish Date - Aug 12 , 2026 | 09:29 AM
బాల్యంలో తనపై లైంగిక దాడి చేసిన సవతి సోదరుడిపై 15 ఏళ్ల తర్వాత ఓ యువతి కేసు పెట్టింది. యువతి ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు సవతి సోదరుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
ఇంటర్‌నెట్ డెస్క్: బాల్యంలో తనపై లైంగిక దాడి చేసిన సవతి సోదరుడిపై 15 ఏళ్ల తర్వాత ఓ యువతి కేసు పెట్టింది. యువతి ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు సవతి సోదరుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. బంజారాహిల్స్‌కు చెందిన ఓ యువతి 8 ఏళ్ల వయసులో తండ్రి, సవతి తల్లి, సవతి సోదరుడు, సవతి సోదరితో కలిసి ఉండేది. ఆ సమయంలో సవతి సోదరుడు ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
భయం కారణంగా ఆనాడు యువతి నోరు విప్పలేకపోయింది. ఇటీవల తల్లి చెప్పడంతో యువతి ధైర్యం తెచ్చుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సవతి సోదరుడు తనపై లైంగిక దాడి చేసిన విషయాన్ని తండ్రికి చెప్పగా.. తనపై దూషణలకు దిగినట్లు ఫిర్యాదులో యువతి పేర్కొంది. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన తను తాజాగా కౌన్సెలింగ్ తీసుకున్నానని తెలిపింది. యువతి ఫిర్యాదు నేపథ్యంలో నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇవి కూడా చదవండి
వికారాబాద్ జిల్లాలో నకిలీ డీఏపీ కలకలం.. ఆందోళనలో రైతులు