Share News

శుభకరం.. శ్రావణ మాసం..

ABN , Publish Date - Aug 12 , 2026 | 12:31 PM

శుభ ముహూర్తాలు, పండుగలు, పర్వదినాలు, పూజలకు ప్రసిద్ధి గాంచింది శ్రావణ మాసం. ఏడాదిలో వచ్చే 12 మాసాల్లో శ్రావణ మాసానికి విశిష్టత ఉంది.

శుభకరం.. శ్రావణ మాసం..
Shravana Masam

  • రేపటి నుంచి మాసం ప్రారంభం

  • పూజలు, వ్రతాలతో మహిళలు బిజీబిజీ

  • ముహూర్తాలు, శుభకార్యాలకు ప్రసిద్ధి

వరంగల్‌ కల్చరల్‌: శుభ ముహూర్తాలు, పండుగలు, పర్వదినాలు, పూజలకు ప్రసిద్ధి గాంచింది శ్రావణ మాసం. ఏడాదిలో వచ్చే 12 మాసాల్లో శ్రావణ మాసానికి విశిష్టత ఉంది. ఈ మాసంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరాధనోత్సవాలు, పవిత్రోత్సవాలు, వ్రతాలు, కుంకుమ పూజలు, పారాయణాలు, శుభకార్యాలు, వివాహాలు ఎక్కువగా జరుగుతాయి. గురువారం నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుంది. ఆగస్టు 13 నుంచి సెప్టెంబరు 11 వరకు ఈ మాసం కొనసాగుతుంది.


అమావాస్యతో ఆషాఢం ముగింపు

జూలైలో ప్రారంభమైన ఆషాఢ మాసం ఆగస్టు 12తో సమాప్తం కానుంది. గురువారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతాలు, శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలు, దత్తాత్రేయ స్వామి అనఘాష్టమి వ్రతాలు ఆచరించుకుంటారు. శ్రావణ మాసం వచ్చిందంటే ఇళ్లల్లో, ఆలయాల్లో సందడి మొదలవుతుంది. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, శుభ కార్యాలు నిర్వహించుకోవడానికి ఇది అనువైన మాసం. ఈ నెలలో దాదాపు 5 వేలకు పైగా పెళ్లిళ్లు జరుగుతాయని విశ్లేషకుల అంచనా. అంతేగాకుండా రాఖీ పౌర్ణమి, వరలక్ష్మి వ్రతాలు, నాగేంద్రస్వామి పూజలు, అమ్మవారికి విశేష పూజలు, జాతీయ జెండా పండుగలు జరుగుతాయి. ఇవే కాకుండా శ్రావణ మాసంలో వన భోజనాలకు కూడా వెళ్తారు.


hnk1.2.jpgఆలయాలు ముస్తాబు

శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పవిత్రోత్సవాలు, తిరునక్షత్రాలు, భగవద్గీత పారాయణాలు, విష్ణు సహస్ర పారాయణాలు, శ్రీలలితా సహస్ర పారాయణాలు, కుంకుమ పూజలు నిర్వహించడానికి ఆలయాలను ముస్తాబు చేస్తున్నారు.


శ్రావణ వేడుకలు ఘనంగా జరుపుకోవాలి

ఈనెల 13 నుంచి శ్రావణ మాసం ప్రారంభం అవుతున్నందున ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అన్ని దేవాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేసినట్లు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ రామల సునిత తెలిపారు. శ్రావణ మాసంలో కుంకుమ పూజలు, సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు, పారాయణాలు నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేయాలని ఈవోలకు సూచించారు. భద్రకాళి దేవాలయంలో భక్తుల దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బాల్యంలో లైంగిక దాడి.. 15 ఏళ్ల తర్వాత సవతి సోదరుడిపై యువతి కేసు..

వికారాబాద్‌ జిల్లాలో నకిలీ డీఏపీ కలకలం.. ఆందోళనలో రైతులు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 12 , 2026 | 12:31 PM