Share News

ఎరువుల కష్టాలకు చెక్‌

ABN , Publish Date - Sep 03 , 2026 | 10:11 AM

కేంద్ర ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం ప్రవేశ పెట్టిన సెంట్రల్‌ ఫర్టిలైజర్‌ యాప్‌ గురువారం నుంచి అందుబాటులోకి రానుంది.

ఎరువుల కష్టాలకు చెక్‌
Central Fertilizer App

  • నేటి నుంచి అమలులోకి సెంట్రల్‌ ఫర్టిలైజర్‌ యాప్‌

  • ఇంటి వద్ద నుంచే మొబైల్‌ ఫోన్‌లో బుక్‌ చేసుకునే అవకాశం

వరంగల్: కేంద్ర ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం ప్రవేశ పెట్టిన సెంట్రల్‌ ఫర్టిలైజర్‌ యాప్‌ గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. యూరియా మాత్రమే కాకుండా డీఏపీ, తదితర కాంప్లెక్స్‌ ఎరువులనూ ఈ యాప్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. యాప్‌ను ఉపయోగించి ఎరువులు కొనుగోలు చేయడానికి తప్పనిసరిగా రైతు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ప్రతీ రైతుకు ఒక ఐడీని కేటాయిస్తారు. రాబోయే రోజుల్లో రైతు భ రోసా సహా ఇతర రైతు సంక్షేమ పథకాల ద్వారా రైతులు ప్రయోజనం పొందేందుకు రిజిస్ట్రేషన్‌ చేసుకొని ఐడీ పొందాల్సి ఉంటుంది.


రైతులు ఎరువులు బుకింగ్‌ చేసుకునేందుకు ఫ్రేమ్‌ వర్క్‌ ఫర్‌ ఫర్టిలైజర్‌ సేల్‌ యాప్‌ (ఎఫ్‌ఎఫ్ఎస్‌) డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఈ యాప్‌తో రైతులకు బహుళ ప్రయోజనాలు సమకూరనున్నాయి. గతంలో మాదిరిగా ఎరువుల కోసం గంటల తరబడి క్యూలో నిలిచి ఉండే ప్రయాస తప్పుతుంది. యాప్‌ ద్వారా ఇంటి నుంచే ఎరువులను బుక్‌ చేసుకోవచ్చు. రైతుకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని బ్యాగ్‌లు వెంటనే బుక్‌ అవుతాయి. విడతల వారీగా పంట కోతకు వచ్చే లోపు 3 విడతలుగా సాగు భూమికి సరిపోను ఎరువులు అందుబాటులో ఉంటాయి.


hnk1.2.jpgరైతులు విచ్చలవిడిగా ఎక్కువ మొత్తంలో ఎరువులు వాడినప్పుడు నేల ఆరోగ్యం దెబ్బతినకుండా శాస్త్రీయంగా ఎరువుల వినియోగం జరుగుతుంది. వృథా వాడకం తగ్గి ఖర్చు ఆదా అవుతుంది. ఎరువులు బ్లాక్‌ మార్కెటింగ్‌ జరుగకుండా పారదర్శకంగా ఏ డీలర్‌ వద్ద ఎంత స్టాక్‌ ఉందో యాప్‌ ద్వారా తెలుస్తుంది. ఎరువులను ఇతర క్రిమిసంహారక మందులు లింక్‌ పెట్టి విక్రయించడం జరుగదు. ఎరువుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వ్యవసాయేతర వాడకాలకు ఉపయోగించకుండా అరికట్టబడుతుంది. ఎరువుల కొరత ఉండదు.


ఈ వార్తలు కూడా చదవండి:

కొనసాగుతున్న ధరల పతనం.. 3 రోజుల్లో రూ.6 వేల పైచిలుకు మేర తగ్గుదల

జాతీయ జలభద్రతకు ఏకీకృత కార్యాచరణ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 03 , 2026 | 10:11 AM