Share News

ఈవినింగ్‌ క్లినిక్‌ల జాడేది..

ABN , Publish Date - Sep 03 , 2026 | 08:37 AM

ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఈవినింగ్‌ ఓపీ క్లినిక్‌లు రోగులకు ఉపయోగంలోకి లేకుండా పోయాయి.

ఈవినింగ్‌ క్లినిక్‌ల జాడేది..
Hyderabad evening clinics

  • మొక్కుబడిగా ప్రారంభించి..

  • ఆ తర్వాత విస్మరించిన యంత్రాంగం

  • అవగాహన కల్పించకపోవడంతో ఆదరణ కరువు

హైదరాబాద్‌ సిటీ: ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఈవినింగ్‌ ఓపీ క్లినిక్‌లు రోగులకు ఉపయోగంలోకి లేకుండా పోయాయి. గాంధీ, ఉస్మానియా, ఎంఎన్‌జే, నిలోఫర్‌, ప్రసూతి ఆస్పత్రులకు ఉదయం ఓపీకి పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నారు. చికిత్స కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. అటు ఓపి చీటి నుంచి మొదలు డాక్టర్‌ వద్దకు, పరీక్షల కోసం రోగులు పడిగాపులు పడుతున్నారు. కొన్నిసార్లు కేవలం ఓపీ చీటి తీసుకోవడం, వైద్యుల వద్ద పరీక్షలు చేయించుకోవడంతోనే సమయం అయిపోతుంది. డాక్టర్లు ఏమైనా పరీక్షలు చేయించుకోవాలంటే మరుసటి రోజు వరకు ఎదురు చూడాల్సి వస్తుంది.


city3.jpgఅమల్లో నిర్లక్ష్యం.. ప్రచారం శూన్యం

ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు ఉదయం 1500 నుంచి 2000 వరకు రోగులు వస్తుంటారు. ఓపీ రిజిస్ట్రేషన్‌ సమయం కూడా ఉదయం 8 నుంచి 12 గంటల వరకు మాత్రమే ఉంటోంది. ఆ తర్వాత వచ్చే వారికి రిజిస్ట్రేషన్‌ చేయరు. కేవలం నాలుగు గంటల ఓపీ సమయం సరిపోవడం లేదు. మరోవైపు దూర ప్రాంతాల నుంచి రోగులకు ఓపీ రిజిస్ట్రేషన్‌ కాకపోతే మరుసటి రోజు ఆస్పత్రి వద్దే ఉండాల్సి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి సాయంత్రం క్లినిక్‌లను అందుబాటులోకి తెచ్చారు. ప్రతీ రోజు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఈ క్లినిక్‌లు పనిచేసే విధంగా వైద్యాధికారులు నిర్ణయించారు.


అయితే అమలు మాత్రం ఈ సాయంత్రం క్లినిక్‌లు నీరుగారిపోతున్నాయి. అటు రోగులు రాక, ఇటు కొంత మంది సీనియర్‌ వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. మరోవైపు సాయంత్రం క్లినిక్‌లు అందుబాటులో ఉన్న విషయం చాలా మందికి తెలియడం లేదు. పెద్దగా ప్రచారం లేక లక్ష్యం నీరుగారిపోతోంది. ఈవినింగ్‌ క్లినిక్‌ల కంటే ఉదయం ఓపీ సమయాలను పెంచడం మంచిదని, కనీసం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉండాలని పలువురు రోగులు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కొనసాగుతున్న ధరల పతనం.. 3 రోజుల్లో రూ.6 వేల పైచిలుకు మేర తగ్గుదల

జాతీయ జలభద్రతకు ఏకీకృత కార్యాచరణ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 03 , 2026 | 08:37 AM