హైదరాబాద్‌లో నేడు విద్యుత్ ఉండని ఏరియాలు..
ABN , Publish Date - Jul 03 , 2026 | 06:59 AM
హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్, హైదరాబాద్ -1 డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.
హైదరాబాద్: విద్యుత్ తీగలకు తాకుతున్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు నిమిత్తం ఆజామాబాద్, హైదరాబాద్ -1 డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈలు నరేంద్రరాజు, వినోద్‌కుమార్ తెలిపారు. నారాయణగూడ, అశోక్‌నగర్, దత్తానగర్ 11కేవీ విద్యుత్ ఫీడర్ల పరిధిలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, ఆప్కో, గాంధీకుటీర్ పరిధిలో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు, సిటీ సెంట్రల్ లైబ్రరీ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామన్నారు.
రాయదుర్గం: లింగంపల్లి విద్యుత్ ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. లింగంపల్లి, హోల్‌సేల్ మార్కెట్, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు శాంతినగర్, చందానగర్‌లో విద్యుత్ ఉండదు.
సంతోష్‌నగర్: టీజీఎస్పీడీసీఎల్ సరూర్‌నగర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మరమ్మతులు, చెట్లకొమ్మల కొట్టివేత పనుల కారణంగా శుక్రవారం విద్యుత్‌సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ తెలిపారు. 11కేవీ చైతన్యపురి, గంగహాస్పటల్ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, 11కేవీ హనుమాన్‌నగర్, ఫణిగిరికాలనీ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో మధ్యాహ్నం 2:30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ తెలిపారు.
ఆస్మాన్‌ఘడ్ డివిజన్ పరిధిలో..
సైదాబాద్: టీజీఎస్పీడీసీఎల్ ఆస్మాన్‌ఘడ్ డివిజన్ పరిధిలో మరమ్మతు పనుల కారణంగా శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. 11కేవీ దిల్‌సుఖ్‌నగర్ ఫీడర్ పరిధిలోని పరిసర ప్రాంతాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, ఎస్‌బీఐ కాలనీ ఫీడర్ పరిధిలోని పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని డీఈ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సవాలు చేసుడే కాదు.. కట్టుబడాలి
Read Latest AP News And Telangana News And International News And Telugu News