హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలో పట్టపగలే దారుణ హత్య..
ABN , Publish Date - Sep 03 , 2026 | 06:44 AM
హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. డెక్కన్ ప్యాలెస్ పరిధిలోని ఓ ప్రైవేట్ స్కూల్ ఎదుట ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, సెప్టెంబర్ 3: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. డెక్కన్ ప్యాలెస్ పరిధిలోని ఓ ప్రైవేట్ స్కూల్ ఎదుట ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అప్పటికే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ హత్య జరగడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఘటనాస్థలిలో లభించిన ఆధారాలను పోలీసులు పరిశీలిస్తూ.. హత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.
మృతుడు జహంగీర్‌బాద్‌కు చెందిన అబ్దుల్ రవూఫ్ అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మృతుడి గుర్తింపు.. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. వ్యక్తిపై దాడి ఎలా జరిగింది? ఎంతమంది ఈ ఘటనలో పాల్గొన్నారు? పాత కక్షలా, వ్యక్తిగత వివాదమా లేక మరేదైనా కారణమా అనే కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనాస్థలికి సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని సైతం పరిశీలించే అవకాశం ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి
వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..