Share News

నేటి నుంచి మరో 14 రోజులు ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , Publish Date - Sep 03 , 2026 | 09:30 AM

హైదరాబాద్‌ నగరంలోని వైశాలినగర్‌ రైల్వే అండర్‌ పాస్‌ వద్ద కొనసాగుతున్న రోడ్డు విస్తరణ, స్ట్రామ్‌ వాటర్‌ డ్రైనేజీ పనుల కారణంగా ట్రాఫిక్‌ ఆంక్షలను మరో 14 రోజులపాటు పొడిగించారు.

నేటి నుంచి మరో 14 రోజులు ట్రాఫిక్‌ ఆంక్షలు
Hyderabad traffic restrictions

  • వైశాలినగర్‌ అండర్‌పాస్‌ పనులు..

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ నగరంలోని వైశాలినగర్‌ రైల్వే అండర్‌ పాస్‌ వద్ద కొనసాగుతున్న రోడ్డు విస్తరణ, స్ట్రామ్‌ వాటర్‌ డ్రైనేజీ పనుల కారణంగా ట్రాఫిక్‌ ఆంక్షలను మరో 14 రోజులపాటు పొడిగించారు. సెప్టెంబర్‌ 3 నుంచి 16 వరకు ట్రాఫిక్‌ మళ్లింపులు అమల్లో ఉంటాయని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పనుల కోసం గతంలో జూలై 16 నుంచి 20 రోజులు,


అనంతరం మరో 29 రోజులు ఆంక్షలు విధించారు. పనులు నిర్ణీత గడువులో పూర్తికాకపోవడంతో ఈ ఆంక్షలను తాజాగా మరో 14 రోజులపాటు పొడిగించారు. వైశాలినగర్‌ అండర్‌పాస్‌ మీదుగా వచ్చి వెళ్లే వాహనాలను మైహోమ్‌ మంగళ టి-జంక్షన్‌ వద్ద మళ్లిస్తారని, ప్రయాణికులు సహకరించాలని ట్రాఫిక్‌ పోలీసులు కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కొనసాగుతున్న ధరల పతనం.. 3 రోజుల్లో రూ.6 వేల పైచిలుకు మేర తగ్గుదల

జాతీయ జలభద్రతకు ఏకీకృత కార్యాచరణ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 03 , 2026 | 09:48 AM