బీజేపీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా..
ABN , Publish Date - Jan 26 , 2026 | 09:21 PM
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి షాక్ ఇస్తూ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
వరంగల్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ (Aroori Ramesh) సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి (BJP) షాక్ ఇస్తూ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తిరిగి బీఆర్ఎస్ (BRS)లో చేరాలని నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీలో చేరినప్పటి నుంచి ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత లభించకపోవడం, స్థానిక రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
త్వరలో బీఆర్ఎస్‌లో చేరుతా..
బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఆరూరి రమేశ్ ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన ఆయన విడుదల చేశారు. ‘భారతీయ జనతా పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నాకు ఇన్ని రోజులు సహకరించిన బీజేపీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు. భారత రాష్ట్ర సమితి అధిష్టానం ఆహ్వానం మేరకు నా ఇంటి పార్టీ బీఆర్ఎస్‌లోకి త్వరలో పలువురు నాయకులు, నా అనుచరులు, అభిమానులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో భారీ ఎత్తున చేరాలని నిర్ణయించుకున్నాను’ అని ఆరూరి రమేశ్ స్పష్టం చేశారు.

సొంత గూటికి..
గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనకు ఆ పార్టీ శ్రేణులతో మంచి సంబంధాలు ఉన్నాయి. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేయడం మేలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే పార్టీ హైకమాండ్‌తో చర్చలు ముగిసినట్లు తెలుస్తోంది.
వరంగల్ రాజకీయాలపై ప్రభావం..
ఆరూరి రమేశ్ వంటి బలమైన నేత తిరిగి రావడంతో వరంగల్ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ కేడర్‌కు కొత్త ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది. ఆరూరి రమేశ్ గతంలో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. సుదీర్ఘ కాలం పాటు గులాబీ పార్టీలో పనిచేశారు. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగానూ పనిచేసిన అనుభవం ఉంది. ఆయనకు బలమైన కేడర్ కూడా ఉంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో మరికొందరు నేతలు కూడా పార్టీలు మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆరూరి రమేశ్ నిర్ణయంతో బీజేపీ తన పట్టును కోల్పోకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
ఈ వార్తలు కూడా చదవండి...
మా అక్క మాట్లాడటం లేదు.. కానిస్టేబుల్ సౌమ్య సోదరుడి ఆవేదన
ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు గుండెపోటు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Read Latest Telangana News And Telugu News