Share News

వికారాబాద్‌ డిపోలో నిలిచిన అద్దె బస్సులు

ABN , Publish Date - Mar 24 , 2026 | 10:37 AM

వికారాబాద్‌ ఆర్టీసీ డిపోలో సోమవారం అద్దె బస్సుల సర్వీసులు నిలిచాయి. డిపో మేనేజర్‌ వైఖరికి నిరసనగా హైర్‌ బస్సుల డ్రైవర్లు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరిస్తేనే అద్దె బస్సులు బయటకు తీస్తామని తేల్చి చెప్పారు.

వికారాబాద్‌ డిపోలో నిలిచిన అద్దె బస్సులు

  • డీఎం వైఖరిని నిరసిస్తూ హైర్‌ సర్వీసు డ్రైవర్ల ఆందోళన

  • అధికారులు, అద్దె బస్సుల యజమానులు, డ్రైవర్ల ప్రతినిధులతో చర్చలు

వికారాబాద్‌: వికారాబాద్‌ ఆర్టీసీ డిపోలో సోమవారం అద్దె బస్సుల సర్వీసులు నిలిచాయి. డిపో మేనేజర్‌ వైఖరికి నిరసనగా హైర్‌ బస్సుల డ్రైవర్లు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరిస్తేనే అద్దె బస్సులు బయటకు తీస్తామని తేల్చి చెప్పారు. దీంతో డిపో పరిధి నస్కల్‌, పరిగి, సదాశివపేట, శంకర్‌పల్లి తదితర రూట్లలో 19హైర్‌ బస్సులు నిలిచి ఆ మార్గాల్లో ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నస్కల్‌, పరిగి రూట్లో ఎనిమిది బస్సులతో 56 ట్రిప్పులు నడపాల్సి ఉండగా, సోమవారం రెండు బస్సులే నడిపారు.


ఈ సందర్భంగా హైర్‌ సర్వీసులు డ్రైవర్లు మాట్లాడుతూ.. తాము కోరిన చోట బస్సులు నిలపడం లేదని ప్రయాణికుల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే డ్రైవర్‌, కండక్టర్లపై చర్యలు తీసుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కొన్ని రోజులుగా డీఎం తమతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, ఒక టీచర్‌ ఫిర్యాదుతో నిజాలు తెలుసుకోకుండానే డ్రైవర్‌, కండక్టర్లకు విధులు కేటాయించడం లేదని మండిపడ్డారు. చిన్న కారణాలకే మందలిస్తూ మానసిక ఒత్తిళ్లకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.


మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నప్పటి నుంచీ తాము ఓపికతో విధులు నిర్వహిస్తోంటే కొందరు కావాలని చేసే ఫిర్యాదుళ్తో వాస్తవమెంతో తేల్చకుండానే చర్యలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీకి ఆదాయాన్ని సమకూర్చడంలో డ్రైవర్లు, కండక్టర్ల పాత్ర కీలకమని తెలిసినా.. అధికారులు తమ పట్ల దురుసుగా, నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారన్నారు. తాము విధులను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, అధికారుల వేధింపులు మాత్రం తగ్గాలని డిమాండ్‌ చేశారు.


bus.jpgఈ సందర్భంగా డీఎం నమ్రత ఉద్యోగులు, హైర్‌ బస్సుల యజమానులు, డ్రైవర్ల ప్రతినిధులతో చర్చలు జరిపారు. మూడు గంటలు కొనసాగిన చర్చల్లో డ్రైవర్లు డీఎం ఎదుట పలు ప్రతిపాదనలు ఉంచారు. 141లో ఉన్న స్టాప్‌లలోనే బస్సులు ఆపుతామని, తమపై వచ్చే ఫిర్యాదులపై విచారణానంతరం తప్పు తేలితే చర్యలు తీసుకోవాలని డీఎంను కోరారు. డ్రైవర్ల ఆందోళనపై స్పందించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు మంగళవారం వికారాబాద్‌ డిపోను సందర్శించనున్నట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

నీటి యుద్ధాలు రాకుండా ముందుగానే మేల్కొనాలి

భద్రాద్రి వివాదంపై నివేదిక లేకుండా ఏంచేస్తాం?

Read Latest Telangana News and National News

Updated Date - Mar 24 , 2026 | 10:37 AM