ఉద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్
ABN , Publish Date - Mar 24 , 2026 | 09:51 AM
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి ఇకపై 20 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించేలా విధి విధానాలను రూపొందిస్తోంది.
హైదరాబాద్, మార్చి 24: దేశంలోని ప్రధాన నగరాలన్నీ కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యానికి వాహనాల పెరుగుదల కూడా ఒక కారణమే. ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) వినియోగం వల్ల కాలుష్యం ఉండదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహానాలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ మంగళవారం గుడ్‌న్యూస్ చెప్పింది.
ఈ ఈవీ వాహనాల కొనుగోలుపై 20 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ డిస్కౌంట్ ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింప చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. అందుకు సంబంధించిన విధి విధానాలను ఈ రోజు మ.12 గంటలకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు జగిత్యాలకు పార్టీ పెద్దలు
నేటి నుంచి కుప్పంలో పర్యటించనున్న భువనమ్మ
For More TG News And Telugu News