వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
ABN , Publish Date - Nov 15 , 2026 | 10:19 AM
వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలం నాందార్ పూర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుంకిమెట్ల నుంచి కోస్గి వెళ్లే రోడ్డులో కారు ఆటో ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.
వికారాబాద్ జిల్లా, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి):: వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలం నాందార్ పూర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుంకిమెట్ల నుంచి కోస్గి వెళ్లే రోడ్డులో కారు ఆటో ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురికి తీవ్ర గాయాలవగా, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
మృతుల్లో ఒకరికి రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఈ ఘటనపై సమాచారం అందగానే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పడం పెద్ద జోక్: బండి సంజయ్
గిగ్ వర్కర్ల సంక్షేమ పథకం ప్రారంభించిన రాహుల్‌గాంధీ
దళిత సీఎం హామీ ఏమైంది.. కేటీఆర్‌కు కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News