చి‘వరి’ ప్రయత్నం.. ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి..
ABN , Publish Date - Oct 13 , 2026 | 01:02 PM
ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి.
షాబాద్(రంగారెడ్డి): ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. దీంతో ఎండుముఖం పడుతున్న పంటకు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి పోస్తున్నారు.
షాబాద్ మండల పరిధిలోని తిమ్మారెడ్డిగూడ గ్రామానికి చెందిన రైతులు గుత్తి రాజు, శివయ్యలు రోజుకు 10 ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి వరి పొలానికి పెడుతున్నారు. ఒక్కో ట్యాంకర్‌కు రూ. 1000 చొప్పున ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కాచిగూడలో తప్పిన ప్రమాదం.. తండ్రి, కూతురిని కాపాడిన కానిస్టేబుల్
Read Latest AP News And Telangana News And International News And Telugu News