Share News

కామారెడ్డి చిన్నారుల ఘటన.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఏఎస్పీ

ABN , Publish Date - Mar 08 , 2026 | 11:43 AM

కామారెడ్డి ఆర్బీ నగర్‌లో దారుణం జరిగింది. అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. చెరువులో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

కామారెడ్డి చిన్నారుల ఘటన.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఏఎస్పీ
Kamareddy Incident

కామారెడ్డి జిల్లా, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డి ఆర్బీ నగర్‌లో దారుణం (Kamareddy Incident) జరిగింది. అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. చెరువులో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు సీపాత్(8), ఆయాత్(7), మరియం(5)గా పోలీసులు గుర్తించారు. పిల్లలను తానే చంపినట్లు తండ్రి ఒప్పుకున్నాడు. చిన్నారుల తండ్రి ఇస్మాయిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి (Kamareddy ASP Chaitanya Reddy) వెల్లడించారు. ముగ్గురు కూతుళ్లను హత్య చేసింది కన్నతండ్రి ఇస్మాయిల్ అని తెలిపారు.


ఇస్మాయిల్‌ను ఇప్పటికే అదుపులో తీసుకున్నామని వివరించారు. అతనికి అప్పుల బాధ, కుటుంబ పోషణ భారమై పిల్లలను హత్య చేసినట్లు తమ విచారణలో తేలిందని పేర్కొన్నారు. పిల్లలను పెద్ద చెరువులో తోసి హత్య చేసి, ఏమి తెలియనట్లుగా తండ్రి ఇస్మాయిల్‌ నాటకమాడారన్నారు. భార్యతో కలిసి పిల్లలు కనిపించడం లేదని తమకు ఫిర్యాదు చేశాడని తెలిపారు. గోసంగి కాలనీలో మరో ఇద్దరు బాలుర మిస్సింగ్‌పై గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని.. త్వరలోనే వారి ఆచూకీ కనిపెడతామని ఏఎస్పీ చైతన్య రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గద్దర్ అవార్డుల ప్రకటన.. చిరంజీవికి ‘ఎన్టీఆర్ నేషనల్’ అవార్డ్

భారీగా మావోయిస్టుల లొంగుబాటు

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 08 , 2026 | 11:45 AM