Share News

నిజామాబాద్ జిల్లాలో సామాజిక బహిష్కరణ ఘటనలపై బీసీ కమిషన్ సీరియస్

ABN , Publish Date - Oct 05 , 2026 | 05:09 PM

నిజామాబాద్ జిల్లాలో సామాజిక బహిష్కరణ ఘటనలపై తెలంగాణ బీసీ కమిషన్ సీరియస్ అయింది. సామాజిక బహిష్కరణ బాధితులతో నేరుగా మాట్లాడనుంది.

నిజామాబాద్ జిల్లాలో సామాజిక బహిష్కరణ ఘటనలపై బీసీ కమిషన్ సీరియస్
BC Commission

నిజామాబాద్ జిల్లా, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్ జిల్లాలో సామాజిక బహిష్కరణ ఘటనలపై తెలంగాణ బీసీ కమిషన్ సీరియస్ అయింది. సామాజిక బహిష్కరణ బాధితులతో నేరుగా మాట్లాడనుంది. ఇందులో భాగంగానే ఈనెల 7వ తేదీన నిజామాబాద్‌లో బీసీ కమిషన్ పర్యటించనుంది. గ్రామ అభివృద్ధి కమిటీల (VDCs) తీరుపై ఆరా తీయనుంది. తాళ్లారం గ్రామంలో బీసీల సామాజిక బహిష్కరణ ఘటనపై ప్రత్యేకంగా చర్చించనుంది.


ఆయా జిల్లాల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నట్లు బీసీ కమిషన్ గుర్తించింది. బాధితులు తమ ఫిర్యాదులను తమ ముందు వివరించేలా ఆదేశాలు ఇవ్వనుంది. ఈ క్రమంలోనే బీసీ కమిషన్ ముందు బాధితులు హాజరవ్వాలని సంబంధిత SHOలను పోలీస్ కమిషనర్ ఆదేశించారు. కలెక్టర్, పోలీస్ కమిషనర్‌తో బీసీ కమిషన్ సమీక్షా సమావేశం నిర్వహించింది.


అలాగే, నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ అధికారితోనూ కమిషన్ సమీక్షా సమావేశం నిర్వహించింది. నిజామాబాద్‌లో 23 ప్రాంతాల బాధితులతో కమిషన్ భేటీ కానుంది. ఈనెల 7వ తేదీన ఉదయం 11 గంటల నుంచి IDOCలో బాధితులతో సమావేశం కానుంది. ఈనేపథ్యంలోనే అధికారులతో ఇవాళ మధ్యాహ్నం కీలక సమీక్షా సమావేశం నిర్వహించింది. సామాజిక బహిష్కరణను అరికట్టేందుకు ముందస్తు చర్యలపై బీసీ కమిషన్ చర్చించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో భారత్ ముందంజలో ఉంది: కిషన్‌రెడ్డి

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో కీలక ముందడుగు.. క్లిష్ట దశను దాటాం: మంత్రి ఉత్తమ్

వెయ్యిరోజులు దాటినా 6 గ్యారెంటీల అమల్లో రేవంత్ సర్కార్ విఫలం: హరీశ్‌రావు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 05 , 2026 | 06:57 PM