Share News

సూర్యాపేటలో విషాదం.. గొడ్డలితో దాడి.. ఇద్దరి మృతి

ABN , Publish Date - Aug 29 , 2026 | 11:11 AM

ఈత చెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర విషాదానికి దారితీసింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో పాత కక్షలు, ఇంటి పక్కన ఉన్న ఈత చెట్టు వివాదం నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

సూర్యాపేటలో విషాదం.. గొడ్డలితో దాడి.. ఇద్దరి మృతి

సూర్యాపేట జిల్లా, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఈత చెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర విషాదానికి దారితీసింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో పాత కక్షలు, ఇంటి పక్కన ఉన్న ఈత చెట్టు వివాదం నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేయడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రగడ్డ తండాలో ఈత చెట్టు విషయంలో కొంతకాలంగా ఇరువర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో మంద వెంకటేశ్వర్లు (62) అక్కడికక్కడే మృతిచెందాడు. అడ్డుకోబోయిన తండ్రి సైదాపై గొడ్డలితో పెద్దబాబు అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సైదా (58) మృతిచెందాడు. ఈ ఘటన అనంతరం నిందితుడు పెద్దబాబును గదిలో బంధించి పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. పెద్దబాబును అదుపులోకి తీసుకునే సమయంలో ఎస్ఐ నవీన్‌పై పెద్దబాబు దాడి చేశాడు. ఈదాడిలో ఎస్‌ఐ తలకు గాయాలయ్యాయి. దీంతో ఎర్రగడ్డ తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.


ఇరువర్గాల మధ్య పాత కక్షలు కూడా ఈ ఘర్షణకు కారణమై ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. అయితే అసలు ఘర్షణకు దారితీసిన కారణాలు, దాడి జరిగిన తీరు, నిందితుడి పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న పెద్దబాబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించే ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈత చెట్టు వివాదం, పాత కక్షల నేపథ్యంలో జరిగిన ఈ ఘటనతో ఎర్రగడ్డ తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు.


ఇవి కూడా చదవండి..

యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవు: మంత్రి తుమ్మల

ఆ ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ల గైర్హాజరుపై మంత్రి దామోదర్ సీరియస్

సమగ్ర విశ్లేషణతోనే నేరాల కట్టడి: డీజీపీ సీవీ ఆనంద్‌

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 29 , 2026 | 12:31 PM