Share News

సూర్యాపేట జిల్లాలో ఈతకు వెళ్లి విద్యార్థుల గల్లంతు

ABN , Publish Date - Sep 12 , 2026 | 06:22 PM

సూర్యాపేట జిల్లాలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఘటన మునగాల మండలం ముకుందాపురం గ్రామంలోని ముక్త్యాల బ్రాంచ్ కెనాల్‌లో జరిగింది.

సూర్యాపేట జిల్లాలో ఈతకు వెళ్లి విద్యార్థుల గల్లంతు
Suryapet District Students Missing

సూర్యాపేట జిల్లా, సెప్టెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లాలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఘటన మునగాల మండలం ముకుందాపురం గ్రామంలోని ముక్త్యాల బ్రాంచ్ కెనాల్‌లో జరిగింది. ఈ ఘటనలో తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. రెండో శనివారం సెలవు రోజు కావడంతో ముకుందాపురం గ్రామంలో సహచర విద్యార్థి అనుదీప్‌తో కలిసి హరీశ్ నాయుడు, స్వరూప్‌లు ఈతకు వెళ్లి గల్లంతయ్యారు.


హరీశ్, స్వరూప్ ఇద్దరు గల్లంతు కాగా, అనుదీప్‌ని స్థానికులు రక్షించారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందగానే యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాలువ నీటిని తగ్గించి విద్యార్థుల కోసం గాలిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నేత్రపర్వంగా ఖైరతాబాద్‌ మహాగణపతి ఆగమన్

చేయూత పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

రెజిమెంట్‌లో ఆయుధాలు చోరీ చేసింది వీరే.. కీలక వివరాలు వెల్లడించిన డీజీపీ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 12 , 2026 | 06:30 PM