నల్లగొండలో విషాదం.. చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరి మృతి
ABN , Publish Date - Jul 05 , 2026 | 07:52 AM
నల్లగొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందారు.
నల్లగొండ, జులై 5 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండలోని ఖాజీరామారం గ్రామం సమీపంలో చేపలు పట్టేందుకు వెళ్లిన మణి భార్గవ్ (13), వినయ్ (10) అనుకోకుండా బావిలో జారి పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు గుర్తించి వెంటనే రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఆలస్యమైంది. మృతదేహాలను బయటకు తీసి అనంతరం పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు.
ఇద్దరు చిన్నారుల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. చిన్న వయస్సులోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. వర్షాకాలంలో బావులు, చెరువులు, కాలువల వద్దకు పిల్లలు ఒంటరిగా వెళ్లకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో భద్రతా చర్యలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు అధికారులను కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రజల ప్రేమే నా బలం.. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై సీఎం రేవంత్‌రెడ్డి
వరంగల్ భద్రకాళీ ఆలయం వద్ద ఉద్రిక్తత.. బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News