నల్లగొండలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - Jun 30 , 2026 | 07:30 AM
నల్లగొండ జిల్లాలోని కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ ఇంటర్‌సిటీ బస్సు, ఎదురుగా వస్తున్న సిమెంట్ ట్యాంకర్ లారీని ఢీకొట్టింది.
నల్లగొండ జిల్లా, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లాలోని కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం సమీపంలో ఈరోజు (మంగళవారం) ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ ఇంటర్‌సిటీ బస్సు, ఎదురుగా వస్తున్న సిమెంట్ ట్యాంకర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. విజయవాడ నుంచి హైదరాబాద్ ప్రైవేట్ ట్రావెల్స్ ఇంటర్‌సిటీ బస్సు వెళ్తుండగా టైర్ పేలింది. దీంతో బస్సు అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న సిమెంట్ ట్యాంకర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తూ ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పినప్పటికీ, కొందరికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.
బస్సు క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను స్థానికులు, పోలీసులు కలిసి బయటకు తీశారు. లారీ డ్రైవర్ కూడా తీవ్ర గాయాలతో క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా కాసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతుల సంస్కృతికి ప్రతీక: మంత్రి పొన్నం ప్రభాకర్
డూప్లికేట్ ఓట్లతోనే రేవంత్‌రెడ్డి గెలిచారని మా అనుమానం: కవిత
Read Latest Telangana News And AP News And National News
And Telugu News