నల్లగొండ.. కుటుంబ సభ్యుల హత్య కేసు.. వీడిన మిస్టరీ
ABN , Publish Date - Jun 25 , 2026 | 10:25 AM
నల్లగొండ పట్టణంలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
నల్లగొండ, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ పట్టణంలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మొదట ఈ ఘటన ఆత్మహత్యా..? లేక హత్యా..? అనే అనుమానాల మధ్య పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా ఈ కేసులో కీలక పురోగతి సాధించారు.
సుపారీ హత్య చేయించింది కూతురే..
ఈ కేసులో మృతులుగా గుర్తించిన వారిలో భార్యాభర్తలు సుల్తాన్(45), హసీనా(40), కొడుకు ముజామిల్ (21), కూతురు అఫోరా (21) ఉన్నారు. మూడు రోజుల వరకు మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. సుల్తాన్ నల్లగొండలోని ప్రకాశం బజారులో బ్యాగుల వ్యాపారం చేసేవారు. ఆయన భార్య హసీనా స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. . వీరి కుమారుడు ముజామిల్ ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె అఫోర ఇదే పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. సుల్తాన్ మొదటి భార్య మృతిచెందింది. హసీనాతో రెండో వివాహం కాగా ఇప్పుడున్న పిల్లలిద్దరూ సుల్తాన్ మొదటి భార్య పిల్లలని స్థానికులు తెలిపారు.
అయితే, నలుగురి హత్య కేసులో సుపారీ హత్య చేయించింది హసీనా మొదటి భర్త కూతురు బుషా బుటానీనే అని పోలీసుల దర్యాప్తులో తేలింది. 150 గజాల ప్లాట్, బంగారం కోసమే బుషా బుటానీనే ఈ హత్యలు చేయించింది. హైదరాబాద్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ని బుషా బుటానీ ప్రేమ వివాహం చేసుకుంది. పాతబస్తీ రౌడీ షీటర్స్‌కి లక్షల రూపాయల సుపారీనీ కూతురు బుషా బుటానీ ఇచ్చింది. ఈ హత్యలకు కారణమైన ఆరుగురు రౌడీ షీటర్స్, హసీనా కూతురు, అల్లుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులంతా హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్లుగా గుర్తించారు.
కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు..
కాగా, ఒకే ఇంట్లో నలుగురు మృతదేహాలు లభించడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. సంఘటనా స్థలం నుంచి సేకరించిన ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా, నిందితుల కదలికల ఆధారంగా ఈ కేసును ఛేదించారు. ప్రస్తుతం అదుపులో ఉన్న నిందితులను పోలీసులు సమగ్రంగా విచారిస్తున్నారు. అయితే హత్యలకు దారితీసిన అసలు కారణాలు, సుఫారీ వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తులు, నిందితుల పాత్రపై పోలీసులు అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఒలింపిక్ రన్ నిర్వహిస్తున్నాం: ఎంపీ రఘునందన్ రావు
రేవంత్‌రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు.. రెన్యువల్ సీఎం.. కేటీఆర్ సెటైర్లు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News