Share News

కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నాననే మాటల్లో వాస్తవం లేదు: రాజగోపాల్ రెడ్డి

ABN , Publish Date - Jul 05 , 2026 | 03:51 PM

రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే లక్ష్యంతో కాంగ్రెస్ పనిచేస్తోందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీకి దూరంగా ఉంటున్నాననే మాటల్లో వాస్తవం లేదని, ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకుంటున్నానని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నాననే మాటల్లో వాస్తవం లేదు: రాజగోపాల్ రెడ్డి
Congress MLA Komatireddy Rajagopal Reddy

యాదాద్రి, జులై 5 (ఆంధ్రజ్యోతి): రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే లక్ష్యంతో కాంగ్రెస్ పనిచేస్తోందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Congress MLA Komatireddy Rajagopal Reddy) వ్యాఖ్యానించారు. పార్టీకి దూరంగా ఉంటున్నాననే మాటల్లో వాస్తవం లేదని, ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకుంటున్నానని స్పష్టం చేశారు. ఈరోజు (ఆదివారం) చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు.


కాంగ్రెస్ కొన్ని నిర్ణయాలను తప్పుపడుతున్నాను తప్ప పార్టీని కాదని తేల్చిచెప్పారు. తెలంగాణలో ఏ నాయకునికి రాహుల్ గాంధీ అంత సమయం ఇచ్చింది లేదని.. పార్టీలో ఆ స్థానం తనకుందని వివరించారు. రాహుల్ గాంధీతో పార్టీ నిర్ణయాలు, కుటుంబ విషయాలు చాలా చర్చించామని తెలిపారు. మానవత్వం ఉన్న గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశంసించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ప్రజల ప్రేమే నా బలం.. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై సీఎం రేవంత్‌రెడ్డి

వరంగల్ భద్రకాళీ ఆలయం వద్ద ఉద్రిక్తత.. బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 05 , 2026 | 03:56 PM