Share News

సూర్యాపేటలో 150 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్

ABN , Publish Date - Nov 01 , 2026 | 01:56 PM

సూర్యాపేటలో భారీ మొత్తంలో గంజాయి తరలిస్తున్న యువకులను కోదాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 150 కిలోల గంజాయి, రెండు ఫోన్లు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. కాగా పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.

సూర్యాపేటలో 150 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్
ganja seizure in suryapet

సూర్యాపేట, నవంబర్ 1: జిల్లాలో భారీ మొత్తంలో గంజాయి లభ్యమవడం కలకలం రేపింది. 150 కిలోల గంజాయిని తరలిస్తున్న యువకులను కోదాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.


సూర్యాపేట జిల్లాలో భారీ మొత్తంలో గంజాయి తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు.. జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 150 కేజీల గంజాయిని తరలిస్తున్న ఐదుగురు యువకుల ముఠాపై పోలీసులు దాడి చేశారు. కాగా.. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు పరారయ్యారు. ఈ మేరకు నిందితుల నుంచి 150 కిలోల గంజాయి, రెండు ఫోన్లు, ఓ కారును స్వాధీనం చేసున్నారు. రాజమండ్రి నుంచి బెంగుళూరుకు గంజాయిను తరలిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కాగా.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ దందాతో ఎవరెవరికి సంబంధం ఉంది. ఇంత పెద్ద మొత్తంలో గంజాయి వీరికి ఎలా లభించింది అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైస్పీడ్ రైళ్ల మార్గాల ప‌నులను వేగ‌వంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం

ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి

ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 01 , 2026 | 01:58 PM