మా ఊరి పేరు టికెట్‌లో ఉండదా?
ABN , Publish Date - Feb 26 , 2026 | 01:15 PM
‘‘మా ఊరి పేరు టీజీఎస్ ఆర్టీసీ టికెట్‌లో ఉండదా?’’ అంటూ గజ్వేల్ మండలం మక్తమాసాన్‌పల్లి గ్రామస్థులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. సుమారు 30 ఏళ్ల క్రితం బంగ్లావెంకటాపూర్ నుంచి విడిపోయి మక్తమాసాన్‌పల్లి ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది.
2 కిలోమీటర్ల దూరంలోని గ్రామం పేరు రావడంపై అభ్యంతరం
ఆర్టీసీ స్టేజీకి మక్తమాసాన్‌పల్లి పేరు పెట్టాలని గ్రామస్థుల వినతి
గజ్వేల్(సిద్దిపేట): ‘‘మా ఊరి పేరు టీజీఎస్ ఆర్టీసీ టికెట్‌లో ఉండదా?’’ అంటూ గజ్వేల్ మండలం మక్తమాసాన్‌పల్లి గ్రామస్థులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. సుమారు 30 ఏళ్ల క్రితం బంగ్లావెంకటాపూర్ నుంచి విడిపోయి మక్తమాసాన్‌పల్లి ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. అయితే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీ రికార్డుల్లో స్టేజీ పేరును అధికారులు మార్చలేదు. గతంలో స్టేజీ నంబర్ల ఆధారంగా ఉన్న టికెట్లు ఉన్నప్పుడు గ్రామస్థులు దీనిని పెద్దగా పట్టించుకోలేదు.
ప్రస్తుతం టికెట్ల జారీ ప్రక్రియ డిజిటల్ రూపంలోకి మారడంతో, తమ ఊరి స్టేజీకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగ్లావెంకటాపూర్ పేరు వస్తుండటంతో గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమా ర్లు గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేయగా, ఈ అంశం ఉన్నతాధికారుల పరిధిలో ఉందని వారు సమాధానమిచ్చా రు. తక్షణమే స్పందించి టికెట్‌పై తమ గ్రామ పేరు వచ్చేలా చూడాలని గ్రామస్థులు డిమాం డ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తగ్గిన బంగారం ధరలు! ప్రస్తుతం రేట్స్ ఇవీ
Read Latest Telangana News and National News