Share News

రైళ్ల పాక్షిక రద్దు

ABN , Publish Date - Feb 26 , 2026 | 12:44 PM

డివిజన్‌ కేంద్రం మీదుగా వెళ్లే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేశామని అధికారులు బుధవారం తెలిపారు. నైరుతి రైల్వే జోన్‌లోని హుబ్లీ డివిజన్‌, క్యాస్టిల్‌ రాక్‌-కులేం రైల్వే సెక్షన్‌లోని ఘాట్‌ మార్గంలో అంతరాయాల కారణంగా గుంతకల్లు మీదుగా వెళ్లే కొన్ని రైళ్లను వాస్కోడగామా వరకూ కాకుండా హుబ్లీ స్టేషన్‌ వరకే పరిమితం చేశామని తెలిపారు.

రైళ్ల పాక్షిక రద్దు

గుంతకల్లు(అనంతపురం): డివిజన్‌ కేంద్రం మీదుగా వెళ్లే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేశామని అధికారులు బుధవారం తెలిపారు. నైరుతి రైల్వే జోన్‌లోని హుబ్లీ డివిజన్‌, క్యాస్టిల్‌ రాక్‌-కులేం రైల్వే సెక్షన్‌లోని ఘాట్‌ మార్గంలో అంతరాయాల కారణంగా గుంతకల్లు మీదుగా వెళ్లే కొన్ని రైళ్లను వాస్కోడగామా వరకూ కాకుండా హుబ్లీ స్టేషన్‌ వరకే పరిమితం చేశామని తెలిపారు. షాలీమార్‌-వాస్కోడగామా (నంబర్‌ 18047) బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‏ను ఏప్రిల్‌ 25 నుంచి జూన్‌ 4వ తేదీ వరకూ, దీని తిరుగు ప్రయాణపు రైలును(18048) ఏప్రిల్‌ 28 నుంచి జూన్‌ 7వ తేదీ వరకూ హుబ్లీ-వాస్కోడగామా మధ్య రద్దుపరచి, షాలీమార్‌-హుబ్లీ మధ్య మాత్రమే నడుపుతామని తెలిపారు.


pandu1.2.jpgతిరుపతి/హైదరాబాదు-వాస్కోడగామా (17419, 17021) వీక్లీ ఎక్స్‌ప్రెస్‏లను ఏప్రిల్‌ 30వ తేదీ నుంచి జూన్‌ 7 వరకూ, వీటి తిరుగు ప్రయాణపు రైళ్లను (17429, 17022) మే 1 నుంచి జూన్‌ 5వ తేదీ వరకూ హుబ్లీ-వాస్కోడగామా సెక్షన్‌లో రద్దుపరచి, హుబ్లీ-తిరుపతి/హైదరాబాదు సెక్షన్లలో మాత్రమే నడుపుతామని తెలిపారు. సికింద్రాబాద్‌-వాస్కోడగామా (17039) బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‏ను ఏప్రిల్‌ 29 నుంచి జూన్‌ 3వతేదీ వరకూ, దీని తిరుగు ప్రయాణపు రైలును(17040) ఏప్రిల్‌ 30 నుంచి జూన్‌ 6వ తేదీ వరకూ కేవలం హుబ్లీ-సికింద్రాబాద్‌ మధ్య మాత్రమే నడుపుతామని రైల్వే అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రాజమండ్రి కల్తీ పాల బాధితులను పరామర్శించిన మంత్రి దుర్గేష్

తగ్గిన బంగారం ధరలు! ప్రస్తుతం రేట్స్ ఇవీ

Read Latest Telangana News and National News

Updated Date - Feb 26 , 2026 | 12:44 PM