ఏపీ టూరిజం రీజనల్ డైరెక్టర్‌గా ఓబులమ్మ
ABN , Publish Date - Feb 26 , 2026 | 11:28 AM
జడ్పీ సీఈవో సి.ఓబులమ్మను అనంతపురం హబ్‌లోని ఏపీ టూరిజం డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటేడ్‌లో రీజనల్ డైరెక్టర్‌గా నియమించారు. బుధవారం ఏపీ టూరిజం శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
కడప: జడ్పీ సీఈవో సి.ఓబులమ్మను అనంతపురం హబ్‌లోని ఏపీ టూరిజం డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటేడ్‌లో రీజనల్ డైరెక్టర్‌గా నియమించారు. బుధవారం ఏపీ టూరిజం శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. జడ్పీ శాఖ పరిధిలో డివిజనల్ డెవల్‌పమెంట్ అధికారిగా ఉన్న ఆమెను 2024లో టీడీపీ ప్రభుత్వం డిప్యుటేషన్ ప్రాతిపదికన కడప జడ్పీ సీఈవోగా నియమించింది. ఈ నేపధ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రెండు వారాల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీడీవోలలో 74 మందికి సీనియారిటీ, రోస్టర్ పాయింట్ల ప్రకారం పదోన్నతులు కల్పించింది.
ఈ మేరకు వారిని జడ్పీ సీఈవోలు, డ్వామా, డీఆర్‌డీఏ పీడీలుగా త్వరలో నియమించనుంది. అయితే పదోన్నతుల జాబితాలో సి.ఓబులమ్మ లేకపోవంతో ఆమె కొనసాగుతున్న జడ్పీ సీఈవో పోస్టుకు పదోన్నతులు పొందిన వారు రానున్నారు. ఈ నేపధ్యంలో ఓబులమ్మను ఏపీ టూరిజం డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో రీజనల్ డైరెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
రాజమండ్రి కల్తీ పాల బాధితులను పరామర్శించిన మంత్రి దుర్గేష్
తగ్గిన బంగారం ధరలు! ప్రస్తుతం రేట్స్ ఇవీ
Read Latest Telangana News and National News