యూరియా కోసం అష్టకష్టాలు!
ABN , Publish Date - Aug 25 , 2026 | 01:25 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఎరువుల యాప్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ-యాప్ సాంకేతిక లోపాలతో రైతుల అరిగోస
కంటతడి పెట్టిస్తున్న ఎరువుల కొరత
సిద్దిపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఎరువుల యాప్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా స్టాక్ వివరాలు ఈ-యా్‌పలో అప్‌లోడ్ చేసిన 5 నుంచి 10 నిమిషాల్లోనే స్టాక్ అయిపోతోంది. వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలు సాగు చేయాలని అధికారులు అవగాహన కల్పించడంతో కొంతవరకు వరి సాగు తగ్గింది. అయినప్పటికీ సిద్దిపేట డివిజన్ పరిధిలో యూరియా డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. డిమాండ్‌కు తగినట్లుగా యూరియా సరఫరా చేయాలని అధికారులు నివేదికలు పంపినప్పటికీ, యాప్‌లోనే బుక్ చేసుకోవాలనే నిబంధన రైతులకు శాపంగా మారింది.
సిద్దిపేట వ్యవసాయ డివిజన్ పరిధిలో గతేడాది వరి సాగు 86 వేల ఎకరాలు కాగా, ఈ వానకాలంలో 73 వేల ఎకరాలకు పడిపోయింది. ఆ స్థానంలో కంది, మొక్కజొన్న తదితర ఆరుతడి పంటలు సాగయ్యాయి. ఈ వానకాలం సీజన్‌కు 12వేల మెట్రిక్ టన్నుల యూరియా డిమాండ్ ఉండగా, నేటి వరకు కేవలం 4,500 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అయింది. మరోవైపు యాప్‌లో సర్వర్ డౌన్ కావడం, ఓటీపీలు సకాలంగా రాకపోవడం, స్టాక్ అయిపోయినా అదనంగా బుకింగ్ కావడంతో గందరగోళం నెలకొంటున్నది.
నంగునూరు మండలం వెంకటాపూర్ మురుదాబాద్, మైసంపల్లి గ్రామాలు ఈ-యా్‌పలో కనిపించడం లేదు. ఫార్మర్ రిజిస్ర్టీ నుంచే ఆ గ్రామాల పేర్లు రాలేదు. ఎల్‌జీ కోడ్స్ మ్యాప్ కాలేదు. అప్పటి నుంచి అధికారులు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కాలేదు. యాప్‌లో ఆ రెండు గ్రామాల పేర్లు లేక ఇతర గ్రామాల రైతులను ఆశ్రయించి ఎంతో కొంత ఎరువులు తెచ్చుకుంటున్నారు.
ఎర్రబడుతున్న మొక్కజొన్న, వరి చేన్లు
దౌల్తాబాద్ మండలంలోనూ యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాలో ఈ వానకాలంలో సుమారు 6 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 3 లక్షల పైగా ఎకరాల్లో వరి, 75 వేల ఎకరాల్లో పత్తి, 80 వేల ఎకరాల్లో మొక్కజొన్న, లక్ష ఎకరాల్లో మిర్చి ఇతర కూరగాయ పంటలు సాగు చేశారు. యూరియా కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌లో
ఈ వార్తలు కూడా చదవండి:
కరువు పరిస్థితుల్లో.. కూరగాయల సాగుకు మొగ్గు
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News