నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
ABN , Publish Date - Aug 25 , 2026 | 11:29 AM
ఏపీలో పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన సంచలనం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు ముందు రోజు అసలు ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
కాకినాడ, ఆగస్టు 25: ఏపీలో పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన సంచలనం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు ముందు రోజు అసలు ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రధాన నిందితుడు సాధిక్ ఖాన్‌కు నూకరాజు కుటుంబానికి మధ్య జరిగిన గొడవలు కాస్తా ఎందుకు ఆత్మహత్య వరకు వెళ్లాయనే దానిపై కీలక వివరాలను రాబట్టారు. సౌజన్యను లోబర్చుకుని మరోపక్క ఆమెకు తెలియకుండానే ఈనెల 14న రహస్య వివాహానికి సాధిక్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన సౌజన్య.. సాధిక్‌ను నిలదీయగా ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం.
తనతో పెళ్లికి అడ్డు చెబితే సౌజన్య ప్రైవేట్ వీడియోలు, భర్త మృతికి సంబంధించిన విషయాలను బయటపెడతానని సాధిక్ బెదిరింపులకు దిగాడు. కొట్టడానికి కూడా సిద్ధమైనట్లు పోలీసుల విచారణలో తేలింది. సాధిక్ ఖాన్ అసలు రూపం బయటపడటంతో పాటు బెదిరింపులకు దిగడంతో నూకరాజు కుటుంబం తీవ్రంగా భయపడిపోయిందని.. అతడి వేధింపులు తాళలేక చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. తన బెదిరింపుల కారణంగానే నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య వరకూ వెళ్లడంతో ఓ లాయర్ సలహాతో సాధిక్ పరారైనట్లు పోలీసుల విచారణలో బయటపడింది.
ఇవి కూడా చదవండి...
డిసెంబర్ చివరి నాటికి క్వాంటం వ్యాలీ భవనం పూర్తి: మంత్రి నారాయణ
విషాదం: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ఆత్మహత్య
Read Latest AP News And Telugu News