విషాదం: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ఆత్మహత్య
ABN , Publish Date - Aug 25 , 2026 | 11:00 AM
శ్రీశైలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీశైలం వడ్డెర అన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఊరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
నంద్యాల, ఆగస్టు 25: శ్రీశైలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీశైలం వడ్డెర అన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఊరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. గత 3 రోజులుగా రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో పాటు దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన సత్రం నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని తలుపులు తెరచి చూడగా బాత్రూమ్‌లో ముగ్గురు మహిళలు, ఫ్యాన్‌కు ఇద్దరు పురుషులు ఉరివేసుకొని కనిపించారు. మృతులు సుధాకర్(36), గోగుల ఆదిలక్ష్మి(50), మల్లేశ్వరి(45), శ్రీదేవి(33), మణికంఠ(15)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
శ్రీశైలం వడ్డెర సత్రంలో సంఘటనా స్థలాన్ని ఆలయ ఈవో శ్రీనివాసరావు, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు, ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ పరిశీలించారు. సుధాకర్ కుటుంబ సభ్యులు.. గత నెల 28వ తేదీన శ్రీశైలం వడ్డెర సత్రం రూమ్ నెంబర్ 11లో రూ. 800 చెల్లించి అద్దెకు తీసుకున్నారు. రెండు రోజుల తర్వాత ఖాళీ చేయాలని వడ్డెర సత్రం నిర్వాహకులు చెప్పినప్పటికీ.. అనారోగ్యంతో వచ్చామని, మరికొద్ది రోజులు ఉండి పూజలు చేయించుకుంటామని సుధాకర్ చెప్పినట్లు సమాచారం. రోజుకు 800 రూపాయలు చెల్లిస్తూ వడ్డెర సత్రంలోనే సుధాకర్ కుటుంబ సభ్యులు ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.
ఐదుగురి మృతదేహాలను కిందకు దించిన శ్రీశైలం పోలీసులు.. శవ పరీక్షల కోసం సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా వడ్డెర సత్రం యాజమాన్యం.. యాత్రికులకు నెల రోజులపాటు రూమును ఎందుకు అద్దెకు ఇచ్చారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతిచెందిన వ్యక్తులు శ్రీశైలంలో నెల రోజులపాటు ఎందుకు ఉన్నారనే కోణంలోనూ విచారణ చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
బళ్లారి చేరుకున్న మంత్రి లోకేశ్.. పలు ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన
డిసెంబర్ చివరి నాటికి క్వాంటం వ్యాలీ భవనం పూర్తి: మంత్రి నారాయణ
Read Latest AP News And Telugu News