హైదరాబాద్‌లో ఇద్దరు చిన్నారుల అదృశ్యం.. గంటల వ్యవధిలోనే
ABN , Publish Date - Aug 25 , 2026 | 09:38 AM
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు చిన్నారుల అదృశ్యం తీవ్ర కలకలం రేపింది. అయితే గంటల వ్యవధిలోనే చిన్నారుల మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించడంతో కథ సుఖాంతమైంది.
హైదరాబాద్, ఆగస్టు 25: నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు చిన్నారుల అదృశ్యం తీవ్ర కలకలం రేపింది. అయితే గంటల వ్యవధిలోనే చిన్నారుల మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించడంతో కథ సుఖాంతమైంది. గచ్చిబౌలిలోని రాఘవ పరాజెక్ట్ లేబర్ క్యాంప్ నుంచి ప్రమీలా ముర్ము (4), సంగీత (3½) అనే ఇద్దరు చిన్నారులు కనిపించకుండా పోయారు. సహోద్యోగి చాకు సోరెన్.. చిన్నారులను దుకాణానికి తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్లాడు. అయితే ఎంతసేపటికీ వారు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినప్పటికీ పిల్లల ఆచూకీ లభించలేదు.
అర్ధారాత్రి అయినా చిన్నారులతో పాటు చాకు సోరెన్ కూడా తిరిగి రాకపోవడంతో నిన్న రాత్రి ఒంటి గంట ప్రాంతంలో గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా నిందితుడిని ఘట్కేసర్ రైల్వే స్టేషన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై చిన్నారులను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. గంటల వ్యవధిలోనే పిల్లల ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ.. పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
బీసీలను జగన్ రెడ్డి మోసం చేస్తున్నారు.. యనమల ధ్వజం
Read Latest Telangana News And Telugu News