స్మార్ట్‌కార్డుల ముద్రణలో నిర్లక్ష్యం
ABN , Publish Date - Aug 25 , 2026 | 12:57 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమం అధికారుల తీవ్ర నిర్లక్ష్యం, సమన్వయ లోపం కారణంగా గందరగోళంగా మారింది.
తూప్రాన్ కార్డులు వట్టూర్ పేరుతో ముద్రణ
తూప్రాన్(మెదక్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమం అధికారుల తీవ్ర నిర్లక్ష్యం, సమన్వయ లోపం కారణంగా గందరగోళంగా మారింది. తూప్రాన్ మున్సిపాలిటీ 4వ వార్డు పరిధిలో 14వ నంబర్ రేషన్‌షా్‌పలో లబ్ధిదారులకు స్మార్ట్‌కార్డులను పంపీణీని సోమవారం ఉదయం రెవెన్యూ అధికారులు, మున్సిపల్‌వార్డు అధికారులు ప్రారంభించారు. అయితే కార్డులపై గ్రామం పేరు తప్పుగా ఉండటంతో అవాక్కయ్యారు.
తూప్రాన్ పట్టణానికి చెందిన లబ్ధిదారుల కార్డులపై మున్సిపాలిటీ పేరుకు బదులుగా మండలంలోని వట్టూర్ గ్రామం పేరు ముద్రించారు. లబ్ధిదారులు ఆందోళన వ్యక్తంచేయడంతో అప్రమత్తమైన అధికారులు కార్డుల పంపిణీ ప్రక్రియను అర్ధాంతరంగా నిలిపివేశారు. కార్డులపై తప్పిదంపై కౌన్సిలర్ జైపాల్‌నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన వివరాలతో కొత్తకార్డులు తిరిగి ముద్రించి అందజేయాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కరువు పరిస్థితుల్లో.. కూరగాయల సాగుకు మొగ్గు
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News