Share News

విదేశాల్లో చదువుకు ‘విద్యానిధి’ భరోసా..

ABN , Publish Date - Aug 25 , 2026 | 11:42 AM

విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు విద్యానిధి ఓవర్సీస్‌ పథకం వరంగా నిలుస్తున్నది.

విదేశాల్లో చదువుకు ‘విద్యానిధి’ భరోసా..
Vidya Nidhi overseas scholarship

  • ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అంబేద్కర్‌ ఓవర్సీస్‌

  • స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

చొప్పదండి(కరీంనగర్): విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు విద్యానిధి ఓవర్సీస్‌ పథకం వరంగా నిలుస్తున్నది. విదేశాల్లో విద్య ఖర్చుతో కూడుకున్నది కావడంతో పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు అందని ద్రాక్షగా మారేది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి, మహాత్మా జ్యోతిబాఫూలే ఓ వర్సీస్‌ విద్యానిధి పథకాలు విద్యార్థులకు వరంగా మారుతు న్నాయి. పేద విద్యార్థుల కలను నెరవేర్చి విదేశాల్లో విద్యనభ్యసించేందుకు ఆలం బనగా నిలుస్తున్నాయి.


edu2.jpgఅంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విదేశాల్లో విద్యనందించే అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం వరంగా మారింది. స్కాలర్‌షిప్‌లకు ఎంపికైన విద్యా ర్థులకు 20 లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వం అంద జే స్తుంది. దీంతోపాటు విమాన, వీసా ఖర్చులను భరిస్తుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు యూఎస్‌ఏ, కెనడా, జర్మనీ, యూకే, సింగపూర్‌, జపాన్‌, ఆస్ర్టేలియాతో పాటు ఇతర దేశాల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు అవకాశం కల్పిస్తున్నది. కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షలలోపు ఉండాలి. కుటుంబంలోని ఒక్క విద్యార్థికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. గ్రాడ్యుయేషన్‌లో 60 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ విద్యార్థులు జీఆర్‌ఈ, జీమ్యాట్‌, ఇంగ్లీష్‌ ప్రొఫిసెన్షీ టెస్ట్‌లో అర్హత పొందాలి. ఎస్టీ విద్యార్థులు జీఆర్‌ఈ, జీమ్యాట్‌, టోఫెల్‌, పీఈటీలో అర్హత సాధించాలి. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.


మహాత్మా జ్యోతిబాఫూలే విద్యానిధి

బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఉన్నత విద్యనందించేం దుకు మహాత్మా జ్యోతిబాఫూలే విద్యానిధి పథకం దోహదపడుతున్నది. ఈ పథకం కింద కూడా రూ.20 లక్షల వరకు స్కాలర్‌షిప్‌ అందజేస్తారు. విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షలలోపు ఉండాలి. గ్రాడ్యుయేషన్‌లో 60 శాతం మార్కులు సాధించ డంతోపాటు జీఆర్‌ఈ, జీమ్యాట్‌, టోఫెల్‌, ఐఈల్‌టీ ఎస్‌, పీటీఈలో అర్హత మార్కులకు ఆధారంగా ఎంపి క చేస్తారు. యూఎస్‌ఏ, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్‌, యూకే, సింగపూర్‌, జపాన్‌, సౌత్‌ కొరియా, ఆస్ర్టేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు అవకాశం కల్పిస్తున్నది.


ఈ వార్తలు కూడా చదవండి:

కరువు పరిస్థితుల్లో.. కూరగాయల సాగుకు మొగ్గు

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 25 , 2026 | 11:42 AM