మెదక్ జిల్లాలో విషాదం.. మంజీరా నదిలో దూకి ముగ్గురి గల్లంతు
ABN , Publish Date - Oct 27 , 2026 | 08:00 PM
మెదక్ జిల్లా ఏడుపాయల బ్రిడ్జి వద్ద మంజీరా నదిలో దూకి తల్లి, ఇద్దరు కుమార్తెలు గల్లంతయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందగానే పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మెదక్ జిల్లా, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): మెదక్ జిల్లా ఏడుపాయల బ్రిడ్జి వద్ద మంజీరా నదిలో దూకి తల్లి, ఇద్దరు కుమార్తెలు గల్లంతయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందగానే పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా మల్కాపూర్ గ్రామానికి చెందిన సరిత (25), తన కుమార్తెలు వైష్ణవి (5వ తరగతి), శ్రావణిక (4వ తరగతి) మంజీరా నదిలో దూకారు. హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా సరిత పనిచేస్తున్నారు. ఆధార్ కార్డు సవరణ కోసం మెదక్‌కు వచ్చి నదిలో దూకినట్లు సమాచారం. మంజీరా నదిలో దూకుతున్నట్లు సరిత తన బంధువులకు ఫోన్ చేసి చెప్పింది.
సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఏడుపాయల వద్ద నది ఒడ్డున ముగ్గురి చెప్పులు, ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గజఈతగాళ్లతో రెండు గంటల పాటు గాలించినా వారి ఆచూకీ దొరకలేదు. చీకటి పడటంతో అధికారులు తాత్కాలికంగా గాలింపు చర్యలను నిలిపివేశారు. ఉదయం నుంచి మళ్లీ గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపునకు మహారాష్ట్ర సీఎం సాకుకూలం.!
విశాంత్ర ఐపీఎస్ భార్య తనూజ హత్య కేసులో రెండు టీమ్‌ల హస్తం.. సజ్జనార్ ఏమన్నారంటే..
హైదరాబాద్‌లో డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News