Share News

మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది కార్లు దగ్ధం

ABN , Publish Date - May 21 , 2026 | 02:52 PM

మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తూప్రాన్ సమీపంలో జాతీయ రహదారి NH-44పై ప్రయాణిస్తున్న కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది కార్లు దగ్ధం
Medak Fire Accident

మెదక్, మే 21 (ఆంధ్రజ్యోతి): మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తూప్రాన్ సమీపంలో జాతీయ రహదారి NH-44పై ప్రయాణిస్తున్న కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మహారాష్ట్ర వైపు నుంచి హైదరాబాద్‌కు వస్తున్నఈ కంటైనర్ లారీ అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఎనిమిది కార్లు దగ్ధం..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లారీలో కొత్తగా తరలిస్తున్న ఎనిమిది మారుతీ కార్లు ఉన్నాయి. మంటలు ఒక్కసారిగా వ్యాపించి కంటైనర్‌తో పాటు అన్ని కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు ఎగిసిపడటంతో జాతీయ రహదారిపై భయాందోళన వాతావరణం నెలకొంది. స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదం కారణంగా NH-44పై కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. భద్రతా చర్యల్లో భాగంగా హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను పోలీసులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చే విషయం. అయితే కోట్ల రూపాయల ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ లేదా సాంకేతిక లోపం వల్లే ఈ మంటలు చెలరేగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడగా, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సరస్వతీ అంత్య పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు.. భక్తులకు సీఎం శుభాకాంక్షలు

కేసీఆర్‌ కుటుంబ పాలనను అంతం చేశాం: బండి సంజయ్‌

ఆ ఆస్పత్రులు ఉచిత సేవలు ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 21 , 2026 | 02:57 PM