Share News

మాంసం.. ఉపవాసం.. పెరిగిన ధరలతో నాన్‌వెజ్‌కు దూరమవుతున్న పేదలు

ABN , Publish Date - Oct 31 , 2026 | 12:52 PM

వర్షాకాలంలో ఆశించిన రీతిలో వర్షాలు కురవకపోవడంతో గ్రామాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.

మాంసం.. ఉపవాసం.. పెరిగిన ధరలతో నాన్‌వెజ్‌కు దూరమవుతున్న పేదలు
Meat Price Hike

  • ఎండిపోయిన చెరువులు.. లభించని చేపలు

  • పక్క గ్రామాల నుంచి తెచ్చి విక్రయం

  • రూ.వెయ్యికి చేరిన మటన్‌.. చికెన్‌ రూ.300పైనే..

  • సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు

మనోహరాబాద్‌(మెదక్): వర్షాకాలంలో ఆశించిన రీతిలో వర్షాలు కురవకపోవడంతో గ్రామాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలంలో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. దీంతో మండలంలోని ఏ ఒక్క చెరువు కూడా నిండి అలుగు పారలేదు. నీరు కరవై చెరువులు అడుగంటిపోవడంతో చేపల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. గతంలో చెరువులు నిండుకుండలా ఉండి, ప్రభుత్వం అందించే సబ్సిడీ చేప పిల్లలను పెంచడం ద్వారా స్థానికంగానే తక్కువ ధరలకు చేపలు లభించేవి.


fish1.jpgకిలో రూ.120 నుంచి రూ.140 వరకు లభించిన చేపలు, ప్రస్తుతం రూ.200కు పైగా పలుకుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో చెరువుల్లో నీరు లేక చేపల ఉత్పత్తి నిలిచిపోవడంతో చిరు వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి చేపలను కొనుగోలు చేసి తెచ్చి ప్రతి ఆదివారం దండుపల్లి, కాళ్లకల్‌, జీడిపల్లి తదితర గ్రామాల సంతల్లో విక్రయిస్తున్నారు. ఒకవైపు చేపల కొరత వేధిస్తుంటే, మరోవైపు మటన్‌, చికెన్‌ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.


గత వారంలో కిలో రూ.800 ఉన్న మటన్‌ ధర ఏకంగా రూ.1000కి చేరింది. చికెన్‌ ధర కూడా కిలో రూ.300 దాటింది. అంతర్జాతీయ పరిస్థితులు, ద్రవ్యోల్బణ ప్రభావంతో పప్పులు, నూనెలు వంటి నిత్యావసరాల ధరలు కూడా రోజురోజుకూ పెరుగుతుండటంతో గ్రామీణ ప్రాంత ప్రజలు, పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ కూల్చివేతలకు పాల్పడిన హైడ్రా.. బాధితుల ఆరోపణలు

రుణ పాట్లు.. మెట్రో టేకోవర్‌కు హెచ్‌ఎంఆర్‌ఎల్‌ తీవ్ర ప్రయత్నాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 12:52 PM