Share News

రుణ పాట్లు.. మెట్రో టేకోవర్‌కు హెచ్‌ఎంఆర్‌ఎల్‌ తీవ్ర ప్రయత్నాలు

ABN , Publish Date - Oct 31 , 2026 | 09:28 AM

మెట్రో మొదటి దశ టేకోవర్‌ కోసం హైదరాబాద్‌ మెట్రో రైల్‌ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

రుణ పాట్లు.. మెట్రో టేకోవర్‌కు హెచ్‌ఎంఆర్‌ఎల్‌ తీవ్ర ప్రయత్నాలు
Hyderabad Metro Rail

  • ఎస్‌బీఐ క్యాపిటల్స్‌తో కలిసి రుణాల కోసం వేట

  • తాజాగా ‘పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌’ను సంప్రదించిన ఎండీ సర్ఫరాజ్‌

  • 3 శాతం వడ్డీతో రూ.13,600 కోట్ల రుణాలు ఇవ్వాలని వినతి

హైదరాబాద్‌ సిటీ: మెట్రో మొదటి దశ టేకోవర్‌ కోసం హైదరాబాద్‌ మెట్రో రైల్‌ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రుణ సమీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కన్సల్టెన్సీగా నియామకమైన ఎస్‌బీఐ క్యాపిటల్‌ సంస్థతో కలిసి వివిధ విభాగాలను సంప్రదిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన 3శాతం వడ్డీతో రూ.13,600 కోట్ల రుణాలను తీసుకొచ్చేందుకు తమవంతుగా కృషి చేస్తున్నారు. నగరంలో మెట్రో రెండో దశ విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం కొన్ని రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.


city5.2.jpgఈ మేరకు పార్ట్‌-ఏలోని 7 కారిడార్లలో 122.9 కిలోమీటర్లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించి, కేంద్ర ప్రభుత్వం నుంచి డీపీఆర్‌ అనుమతి కోసం ఎదురుచూస్తోంది. అయితే ఎల్‌అండ్‌టీ నుంచిమొదటి దశను టేకోవర్‌ చేసుకుంటేనే ఆమోదం ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉండడంతో ప్రాజెక్టును స్వాధీనం చేసుకునేందుకు కావాల్సిన రుణాల కోసం ప్రయత్నిస్తోంది.


రుణమివ్వాలని వినతి

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో హెచ్‌ఎంఆర్‌ ఎల్‌ ఎండీ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఇటీవల ఢిల్లీకి వెళ్లి రెండో దశ అనుమతులకు సంబంధించి కేంద్ర గృహనిర్మాణశాఖ అధికారులను కలిసి మాట్లాడినట్లు తెలిసింది. ఇదే సమయంలో ఎస్‌బీఐ క్యాపిటల్స్‌తో పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఉన్నతాధికారులను సంప్రదించి రుణ సమీకరణపై చర్చించినట్లు సమాచారం. 3శాతం వడ్డీతో రూ.13,600 కోట్లను అందిస్తే నిర్ణీత కాలవ్యవధిలో చెల్లిస్తామని చెప్పినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ అధికారులతో పాటు ఎల్‌అండ్‌టీ అధికారులు కూడా ఇదే పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ను కలిసి రుణాల విషయమై ఇటీవల తమవంతుగా విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

హుస్సేన్‌సాగర్‌లో నీటికాలుష్యం..!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 10:05 AM