Share News

షాపింగ్ పేరుతో నగల చోరీ.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు

ABN , Publish Date - Oct 31 , 2026 | 07:56 AM

నగలు కొనుగోలు చేయడానికి వచ్చినట్లు నటించి ఏకంగా భారీ చోరీకి పాల్పడ్డారు కొందరు మహిళలు. దుకాణదారుడి దృష్టిని ఏమార్చి బంగారు లాకెట్టు ఉన్న పెట్టెను క్షణాల్లోనే మాయం చేశారు. ఎంతో చాకచక్యంగా జరిగిన ఈ చోరీ దుకాణంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.

షాపింగ్ పేరుతో నగల చోరీ.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
Jewellery Shop Theft

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా నగల దుకాణాలకు వచ్చే కస్టమర్లకు రకరకాల డిజైన్లతో కూడిన బంగారు ఆభరణాలు చూపించడం సర్వసాధారణం. అయితే.. ఇదే దీన్నే ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా.. అలాంటి షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలు దుకాణానికి నగలు కొనుగోలు చేసే నెపంతో వచ్చారు. ఈ క్రమంలో ఓ మహిళ దుకాణదారుడి దృష్టిని మరల్చి బంగారు లాకెట్టు ఉన్న పెట్టెను చాకచక్యంగా అపహరించింది. ఈ మొత్తం వ్యవహారం దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డవడంతో అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం ఈ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


దుకాణదారుడి దృష్టి మరల్చి చోరీ..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు మహిళలు సాధారణ కస్టమర్ల మాదిరిగా దుకాణంలోకి ఎంట్రీ ఇచ్చారు. వారితో పాటు ఒక చిన్నపిల్లను తీసుకొచ్చారు. ఎలాంటి అనుమానం రాకుండా దుకాణదారుడితో మాటలు కలుపుతూ నగలు చూపించాలని అడిగారు. పైన ట్రేలో ఉన్న ఆభరణాలను చూపించాలంటూ పదేపదే అడుగుతూ.. అతడి దృష్టి అటువైపు వెళ్లేలా చేశారు. దుకాణదారుడు వారి కోరిక మేరకు పై ట్రేటో ఉన్న నగలు, పెట్టెలను తీసి చూపించడంలో నిమగ్నమయ్యాడు. ఇదే అదనుగా భావించిన కింద కూర్చున్న మహిళ కౌంటర్‌పై ఉంచిన బంగారు లాకెట్టు పెట్టెను ఎవరికీ అనుమానం రాకుండా నెమ్మదిగా తీసుకుంంది. అనంతరం క్షణాల్లోనే దానిని తన చీర కింద దాచేసి ఏమీ తెలియనట్టుగా సాధారణంగా కూర్చుంది. అయితే.. ఈ ఘటన ఎక్కడ జరిగింది, నిందితులను పోలీసులు గుర్తించారా అనే వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ వీడియో Manoj_Indore అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘ఇలాంటి మోసగాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి’ అని, ‘నగల షాపులో ఒక్కడినే టార్గెట్ చేశారు.. ఈజీగా కొట్టేశారు’ అని ఒకరు, ‘బంగారం చాలా ఖరీదైంది.. అందుకే ఇలా..’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

‘భోగాపురం’ కాదు.. విశాఖపట్నం ఎయిర్‌పోర్టే!

మణ్ణారశాలలో నేటి నుంచి ఆయిల్యా ఉత్సవాలు

For More AP News And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 08:08 AM