సర్‌పై చర్చకు సిద్ధం.. రాహుల్, అఖిలేశ్‌కు అమిత్ షా సవాల్
ABN , Publish Date - Oct 31 , 2026 | 07:25 AM
ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై పార్లమెంటులో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దీనిపై చర్చించేందుకు సిద్ధమా అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌కు ఆయన సవాలు విసిరారు.
ఇంటర్నెట్ డెస్క్: ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై పార్లమెంటులో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దీనిపై చర్చించేందుకు సిద్ధమా అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌కు ఆయన సవాలు విసిరారు. ఈ అంశంపై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. శుక్రవారం లక్నోలో జరిగిన ఉత్తరప్రదేశ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్ల జాబితాల అంశంపై చర్చించేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, ఆ విషయంలో దాచడానికి ఏమీ లేదని చెప్పారు. కానీ, ప్రతిపక్షాలు పార్లమెంటులో ఆ విషయంపై చర్చకు ముందుకు రావడం లేదని, సభా కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టిస్తున్నాయని విమర్శించారు. రాహుల్ గాంధీ పార్లమెంటులో ఆ అంశంపై చర్చించకుండా వీధుల్లో ఆందోళనలు చేస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. హర్యానా, మహారాష్ట్ర, బిహార్, ఢిల్లీ, పుదుచ్చేరి, అసోం, పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎన్నికల్లో గెలవలేమని ప్రతిపక్షాలకు అర్థమైందన్నారు. ఓటమిని అంగీకరించకుండా ఓట్ల చోరీ జరిగిందంటూ ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
కాగా.. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై కాంగ్రెస్ పార్టీ ప్రజా అభిశంసన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించగా.. ఆ కార్యక్రమం వాయిదా పడింది. శుక్రవారం జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని వర్షం కారణంగా శనివారానికి మార్చారు. తొలుత మాక్ పార్లమెంటుగా ప్రకటించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తర్వాత ప్రజా అభిశంసనగా పేరు మార్చింది. సీఈసీని అభిశంసించే ప్రక్రియకు కాంగ్రెస్ ఇచ్చిన నోటీసులు అంతకుముందే తిరస్కరణకు గురయ్యాయి. అంతేకాకుండా, ఆ ప్రక్రియకు అవసరమైన సంఖ్యాబలం కూడా ఆ పార్టీకి లేదు. శనివారం జరిగే కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఆదివారం రాంలీలా మైదానంలో ఎన్నికల కమిషనర్, సర్ విధానానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి భారీ ర్యాలీ నిర్వహించనుంది.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖ పోర్టులో భారీ అగ్నిప్రమాదం.. నిర్మాణంలో ఉన్న కన్వేయర్ బెల్ట్‌లో మంటలు
పూలు కోస్తూ 23వ అంతస్తు నుంచి పడి తండ్రీకొడుకు మృతి
రైతుల ఖాతాల్లోకి పీఎం-కిసాన్ 24వ విడత నిధులు.. 9.34 కోట్ల మందికి రూ.18,680 కోట్లు!