Share News

పూలు కోస్తూ 23వ అంతస్తు నుంచి పడి తండ్రీకొడుకు మృతి

ABN , Publish Date - Oct 30 , 2026 | 02:55 PM

ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. పూజ కోసం పూలు కోస్తున్న క్రమంలో బాల్కనీ నుంచి జారిపడి తండ్రీకుమారుడు దుర్మరణం చెందారు.

పూలు కోస్తూ 23వ అంతస్తు నుంచి పడి తండ్రీకొడుకు మృతి
Greater Noida Accident

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. పూజ కోసం పూలు కోస్తున్న క్రమంలో బాల్కనీ నుంచి జారిపడి ఒక వ్యక్తి, అతడి 11 ఏళ్ల కుమారుడు దుర్మరణం చెందారు. గ్రేటర్ నొయిడాలోని బిస్రాఖ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న 'మహాగున్ మైవుడ్స్ సొసైటీ'లో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...


'మహాగున్ మైవుడ్స్ సొసైటీ'లో రన్‌దీప్ పాత్రా (40) కుటుంబం నివాసం ఉంటుంది. అతడికి 11 ఏళ్ల ఆరవ్ అనే కుమారుడు ఉన్నాడు. శుక్రవారం ఉదయం రన్‌దీప్ భార్య 'ఖతు శ్యామ్ ఆలయం' దర్శనానికి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఇంటిలో పూజ చేయడం కోసం పూలు తీసుకురమ్మన్ని భర్తకు తెలిపింది. దీంతో రన్‌దీప్ పాత్రా, కుమారుడు ఆరవ్‌తో కలిసి పూలు కోయడానికి ఇంట్లోనే బాల్కనీలోకి వెళ్లారు.


ఈ సమయంలో ప్రమాదవశాత్తు చిన్నారి ఆరవ్ బాల్కనీ నుంచి కాలుజారి కిందపడిపోయాడు. కొడుకును రక్షించుకునే ప్రయత్నంలో తండ్రి రన్‌దీప్ కూడా బాల్కనీలో బ్యాలెన్స్ కోల్పోయి 23వ అంతస్తు నుంచి కిందకి పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన తండ్రీకొడుకులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.


ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులు దుర్మరణం చెందడంతో ఆ రెసిడెన్షియల్ సొసైటీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

కుట్ర రాజకీయాలకు తెరలేపిన వైఎస్ జగన్: దేవినేని ఉమా

ఐపీఎల్ 2028: గంభీర్‌ కోసం నాలుగు ఫ్రాంచైజీల పోటీ.. కోచ్‌గా చేరాలంటూ..!

రైతుల ఖాతాల్లోకి పీఎం-కిసాన్ 24వ విడత నిధులు.. 9.34 కోట్ల మందికి రూ.18,680 కోట్లు!

Updated Date - Oct 30 , 2026 | 03:30 PM