Share News

రైతుల ఖాతాల్లోకి పీఎం-కిసాన్ 24వ విడత నిధులు.. 9.34 కోట్ల మందికి రూ.18,680 కోట్లు!

ABN , Publish Date - Oct 30 , 2026 | 01:41 PM

పీఎం-కిసాన్ పథకం 24వ విడతలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రూ.18,680 కోట్ల నిధులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.34 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డీబీటీ ద్వారా రూ.2,000 చొప్పున జమ అయ్యాయి.

రైతుల ఖాతాల్లోకి పీఎం-కిసాన్ 24వ విడత నిధులు.. 9.34 కోట్ల మందికి రూ.18,680 కోట్లు!
PM Kisan 24th Installment

ఆంధ్రజ్యోతి, అక్టోబర్ 30: ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా భీల్డి వేదికగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) 24వ విడత నిధులను అధికారికంగా విడుదల చేశారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా దేశవ్యాప్తంగా అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈ సొమ్ము జమ అయింది. దేశవ్యాప్తంగా మొత్తం 9.34 కోట్ల మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ఈ విడత కింద మొత్తం రూ. 18,680 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతీ అర్హత కలిగిన రైతు ఖాతాలో ఉచితంగా రూ. 2,000 చొప్పున సాయం ట్రాన్స్ ఫర్ చేశారు.


ఈ విడతలో భాగంగా ఒక్క గుజరాత్ రాష్ట్రంలోనే 52.33 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు రూ.1,051 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందింది. ఈ పథకం ద్వారా ఏటా ప్రతి రైతు కుటుంబానికి రూ. 6,000 చొప్పున మూడు విడతల్లో (విడతకు రూ. 2,000) ఆర్థిక సాయం అందజేస్తారు. ఇప్పటివరకు దాఖలైన 24 విడతల ద్వారా దేశవ్యాప్తంగా రైతులకు రూ. 4.65 లక్షల కోట్లకు పైగా నిధులు నేరుగా చేరాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

‘భోగాపురం’ కాదు.. విశాఖపట్నం ఎయిర్‌పోర్టే!

మణ్ణారశాలలో నేటి నుంచి ఆయిల్యా ఉత్సవాలు

For More AP News And Telugu News

Updated Date - Oct 30 , 2026 | 01:57 PM