Share News

పలు జిల్లాల్లో టీజీ సేఫ్ మెరుపు దాడులు.. 9 కేంద్రాల లైసెన్సులు సస్పెండ్

ABN , Publish Date - Oct 30 , 2026 | 12:49 PM

ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని టీజీ సేఫ్ (తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్) అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఆహార పదార్థాల తయారీ కేంద్రాలపై మెరుపుదాడులు నిర్వహిస్తున్నారు.

పలు జిల్లాల్లో టీజీ సేఫ్ మెరుపు దాడులు.. 9 కేంద్రాల లైసెన్సులు సస్పెండ్

హైదరాబాద్, అక్టోబర్ 30: ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని టీజీ సేఫ్ (తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్) అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఆహార పదార్థాల తయారీ కేంద్రాలపై మెరుపుదాడులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం తాజాగా వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి జిల్లాల్లోని 20 ఆహార తయారీ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. మసాలాలు, నూనెలు, పాల ఉత్పత్తులు, స్వీట్లు, ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాల్లో పోలీసులతో కలిసి 10 టీజీ సేఫ్ అధికారుల బృందాలు ఈ తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా 5,555 కిలోల ఆహార పదార్థాలు సీజ్ చేసి.. వాటిని ధ్వంసం చేశాయి. అలాగే అవి కల్తీ జరిగాయనే సందేహంతో 21 ఆహార నమూనాలు సేకరించాయి.


ఇక ఈ తనిఖీల్లో పలు తయారీ కేంద్రాల్లో తుప్పుపట్టిన యంత్రాలతోపాటు అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు ఆ బృందాలు గుర్తించాయి. అదే విధంగా గడువు ముగిసిన ఆహార పదార్థాలతోపాటు తప్పుడు లేబులింగ్ ఉన్నట్లు కనుగొన్నాయి. అంతేకాదు ఆహార పదార్థాల్లో బొద్దింకలు, ఈగలు, దోమలు సంచారిస్తున్నట్లు గుర్తించాయి. కొన్ని కేంద్రాల్లో ఎలుకల వ్యర్థాలు.. ఆహార పదార్థాలపై పురుగుల ప్రభావం ఉన్నట్టు ఈ బృందాలు గమనించాయి. హెయిర్ నెట్స్, గ్లౌజులు, అప్రాన్లు లేకుండానే ఈ ఆహార పదార్థాలను సిబ్బంది తయారు చేస్తున్నట్లు ఈ బృందాలు గుర్తించాయి.


ఆహార పదార్థాలను నేలపైనే నిల్వ చేయడమే కాకుండా.. ఫుడ్, నాన్ ఫుడ్ వస్తువులను కలిపి ఉంచడం పట్ల ఆహార పదార్థాల తయారీ కేంద్రం యాజమానులపై టీజీ సేఫ్ బృందాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అలాగే తొమ్మిది ఆహార తయారీ కేంద్రాలకు షోకాజ్ నోటీసులు జారీ చేశాయి. మరో రెండు కేంద్రాల్లో లోపాల ఉన్నట్లు గుర్తించాయి. దీంతో ఆ లోపాలను సవరించుకోవాలంటూ ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశాయి. ఇక తొమ్మిది తయారీ కేంద్రాల లైసెన్సులను సస్పెండ్ చేశాయి. తక్షణమే వ్యాపార కార్యకలాపాలు నిలిపివేయాలని ఆయా కేంద్రాల యాజమానులను టీజీ సేఫ్ అధికారులు ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

‘భోగాపురం’ కాదు.. విశాఖపట్నం ఎయిర్‌పోర్టే!

మణ్ణారశాలలో నేటి నుంచి ఆయిల్యా ఉత్సవాలు

For More TG News And Telugu News

Updated Date - Oct 30 , 2026 | 01:55 PM