Share News

ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌లో ఊహించని ట్విస్ట్.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Oct 30 , 2026 | 01:34 PM

పెళ్లికి ముందు అందమైన ఫొటోలు దిగాలనుకుంది. అందుకోసం భారీ బెలూన్లతో ఫోజులిచ్చింది. కానీ ప్రకృతి ఒక్కసారిగా షాకిచ్చింది. బలంగా వీచిన గాలులకు ఆ బెలూన్లు గాలిపటాల్లా మారి వధువును ఏకంగా గాల్లోకి లేపేంత పని చేశాయి.

ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌లో ఊహించని ట్విస్ట్.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
Pre Wedding Photoshoot

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లికి ముందు ఫోటోషూట్‌ను జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలని భావించిన ఓ యువతికి ఊహించని అనుభవం ఎదురైంది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో ప్రసిద్ధ బోస్ఫరస్ జలసంధి సమీపంలో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ జరుగుతోంది.

ఈ సందర్భంగా వధువు అందమైన దుస్తులు ధరించి.. గోధుమ రంగు బెలూన్లను ఒంటి చేత్తో పట్టుకుని ఫొటోలకు ఫోజులిస్తోంది. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఒక్కసారిగా బలమైన గాలులు వీచాయి. దీంతో బెలూన్లు గాలికి వేగంగా పైకి ఎగరడంతో వాటిని పట్టుకున్న వధువు నేలపై నిలబడలేకపోయింది. ఏకంగా గాల్లోకి ఎగిరిపోతుందా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అంతేకాకుండా గాలి ధాటికి ఆమె సమీపంలోని సముద్రపు గోడ వైపు కొట్టుకుపోవడం ప్రారంభించింది.


సమయానికి స్పందించిన ఫొటోగ్రాఫర్.. తప్పిన ప్రమాదం..

వధువు అదుపు తప్పి సముద్రపు గోడ వైపు వెళ్లడాన్ని గమనించిన ఫొటోగ్రాఫర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. క్షణం ఆలస్యం చేయకుండా ఆమెను పట్టుకుని కాపాడాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ అనూహ్య ఘటన ఫోటోషూట్ సమయంలోనే కెమెరాలో రికార్డైంది. అనంతరం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. అదృష్టవశాత్తూ వధువుకు ఎలాంటి గాయాలు కాలేదు. కొద్దిసేపు భయాందోళనకు గురైనప్పటికీ, ఆ తర్వాత ఆమె తిరిగి ఫోటోషూట్‌ను పూర్తి చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

‘భోగాపురం’ కాదు.. విశాఖపట్నం ఎయిర్‌పోర్టే!

మణ్ణారశాలలో నేటి నుంచి ఆయిల్యా ఉత్సవాలు

For More AP News And Telugu News

Updated Date - Oct 30 , 2026 | 02:32 PM