స్నేహితుడిని ఆటపట్టించేందుకు బాంబు బెదిరింపు కాల్.. చివరకు.
ABN , Publish Date - Oct 30 , 2026 | 04:39 PM
స్నేహితుడిని ఆటపట్టించాలనే ఉద్దేశంతో చేసిన ఫోన్ కాల్ ఓ యువకుడు అరెస్టయ్యాడు. ఢిల్లీలో బాంబు పేలుళ్లు జరగనున్నాయంటూ వచ్చిన బెదిరింపు కాల్ పోలీసులు దర్యాప్తు చేయగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: తరచూ ఏదోతఒక ప్రాంతంలో బాంబు బెదిరింపు కాల్స్ వస్తుంటాయి. వీటిల్లో కొన్ని ఫేక్ కాల్స్ ఉంటాయి. కొందరు ఆకతాయిలు పోలీసులను, తమ బంధువులను, తమ స్నేహితులను ఆటపట్టించేందుకు ఇలాంటి ఫేక్ కాల్స్ చేస్తుంటారు. తాజాగా సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఓ యువకుడు తన స్నేహితుడిని ఆటపట్టించేందుకు బాంబ్ బెదిరింపు కాల్ చేసి.. చివరకు జైలు పాలయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
బీహార్‌కు చెందిన సుమన్ కుమార్ ఢిల్లీలో ఉంటూ యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. ఈ నెల 27న అతడికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి.. తాను పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన ఒక సంస్థతో తనకు సంబంధం ఉందని చెప్పుకున్నాడు. ఈ సంస్థ ఢిల్లీలో బాంబు పేలుళ్లు జరిపేందుకు కొందరు వ్యక్తులను ఎంపిక చేసిందని తెలిపాడు. భయపడిన సుమన్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు విచారణలు ఆసలు విషయం వెలుగులోకి వచ్చింది.
సుమన్‌కు కాల్ చేసిన వ్యక్తి.. అతడి మాజీ రూమ్‌మేట్ 23 ఏళ్ల సూరజ్ వర్మగా పోలీసులు గుర్తించారు. సుమన్, మరో స్నేహితుడి రోహిత్‌లను ఆటపట్టించేందుకు ఇలా చేసినట్లు సూరజ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. అతడు తన బంధువుల ఇంట్లోని ల్యాండ్‌లైన్ నంబర్ నుంచి ఫోన్ కాల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో రోహిత్, సుమన్ కుమార్, సూరజ్ వర్మ ఓకే రూమ్ లో ఉంటూ సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారని దర్యాప్తులో వెల్లడైంది. మొత్తంగా సాంకేతిక ఆధారాల సాయంతో 48 గంటల్లోనే ఈ కేసును పోలీసులు ఛేదించారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖ పోర్టులో భారీ అగ్నిప్రమాదం.. నిర్మాణంలో ఉన్న కన్వేయర్ బెల్ట్‌లో మంటలు
పూలు కోస్తూ 23వ అంతస్తు నుంచి పడి తండ్రీకొడుకు మృతి
రైతుల ఖాతాల్లోకి పీఎం-కిసాన్ 24వ విడత నిధులు.. 9.34 కోట్ల మందికి రూ.18,680 కోట్లు!