Share News

కాంగ్రెస్ ప్రభుత్వానికి మందు చూపు తప్ప ముందు చూపు లేదు: రఘునందన్ రావు

ABN , Publish Date - Oct 30 , 2026 | 03:26 PM

వ్యవసాయం అనేది రాష్ట్ర ప్రభుత్వ అంశమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఢిల్లీకి ఎన్నిసార్లు తిరిగారో అన్ని సార్లు రైతుల వద్దకు తిరిగి ఉంటే.. వారికి నీళ్లు, కరెంట్ ఎంత అవసరం ఉంటుందో తెలిసేదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి మందు చూపు తప్ప ముందు చూపు లేదు: రఘునందన్ రావు
MP Raghunandan Rao

సిద్దిపేట, అక్టోబర్ 30: వ్యవసాయం అనేది రాష్ట్ర ప్రభుత్వ అంశమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఈరోజు (శుక్రవారం) ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. ఢిల్లీకి ఎన్నిసార్లు తిరిగారో అన్ని సార్లు రైతుల వద్దకు తిరిగి ఉంటే.. వారికి నీళ్లు, కరెంట్ ఎంత అవసరం ఉంటుందో తెలిసేదన్నారు. ఈ ప్రభుత్వానికి ఏ ఆలోచనా లేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అయితే ఏకంగా రబీ సాగు చేయొద్దని రైతులకు చెబుతున్నారని మండిపడ్డారు. సంగారెడ్డి చుట్టూ ఉన్న ప్రభుత్వ పరిశ్రమలకు 50 శాతం మాత్రమే నీళ్లు ఇవ్వాలని చెప్పిన ప్రభుత్వం, బీరు కంపెనీలకు మాత్రం వంద శాతం నీళ్లు ఇస్తున్నారని విమర్శించారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి మందు చూపు తప్ప.. ముందు చూపు లేదంటూ వ్యాఖ్యానించారు.


మందు కావలి కానీ.. జిల్లా ప్రజలకు నీళ్లు ఇవ్వడానికి మాత్రం ముందు చూపు లేదంటూ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలపక్షం తీసుకున్న నిర్ణయాలకు తాము కూడా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర పెద్దలు వస్తే... కేంద్రం పది రూపాయలు ఇచ్చేలా ఉంటే.. 15 రూపాయలు ఇచ్చేలా కృషి చేస్తామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కూడా ఆరోపణలు, విమర్శలు తప్ప ఇద్దరూ గ్రౌండ్‌లో పని చేయడం లేదని విమర్శించారు. మల్లన్నసాగర్‌లో నీళ్లు లేవని ప్రభుత్వమే చెబుతోందని.. మరి 20 టీఎంసీలు ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు.


‘కాంగ్రెస్‌కు ముందు చూపు లేదు, ఆలోచన లేదు.. చెప్పిన మాటలు ఆచరించే నైజం లేదు. కాళేశ్వరం ఉందా లేదా.? రిపేర్ చేస్తారా లేదా..? కాళేశ్వరం పనికి వస్తదా లేదా.. అనేది ఈ రోజు వరకు కాంగ్రెస్ చెప్పలేదు. మొత్తం ప్రాజెక్ట్‌పై విచారణ చేయాలని మేము అడుగుతున్నాం.. కానీ మూడు బ్యారేజ్‌ల గురించే కాంగ్రెస్ మాట్లాడుతుంది. కాంగ్రెస్ ఎలాంటి భరోసా ఇవ్వదు. కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో సున్నా సీట్లని ఆ పార్టీకి మనమే భరోసా ఇవ్వాలి. సర్‌పై కాంగ్రెస్ ఆందోళనలు రాజకీయంగా చేస్తున్న క్రీనిడలు తప్ప మరోటి కాదు. రాజ్యాంగ వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేయాలనే దుర్మార్గ ఆలోచన తప్ప మరోటి కాదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకరికొకరు కలిసి పని చేస్తున్నాయని... బీజేపీ ప్రజలతో కలిసి పని చేస్తుంది’ అంటూ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తిరుగుతా.. ఈటల సంచలన వ్యాఖ్యలు

రూ.50వేల కోట్ల విలువైన భూములు కాజేసే కుట్ర.. గత ప్రభుత్వంపై రేవంత్ ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 30 , 2026 | 04:23 PM