Share News

అటల్‌ నిజమైన ప్రజాస్వామిక వాది

ABN , Publish Date - Oct 31 , 2026 | 05:20 AM

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయీ నిజమైన ప్రజాస్వామిక వాది. దేశానికి సుపరిపాలన అంటే ఏమిటో చూపించారు. అన్ని సమస్యలను అందర్నీ కలుపుకుని పోవడం ద్వారానే పరిష్కరించారు’ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.

అటల్‌ నిజమైన ప్రజాస్వామిక వాది

  • ఆయన విలువలు నేటికీ ఆదర్శం: వెంకయ్య

న్యూఢిల్లీ, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి) : ‘మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయీ నిజమైన ప్రజాస్వామిక వాది. దేశానికి సుపరిపాలన అంటే ఏమిటో చూపించారు. అన్ని సమస్యలను అందర్నీ కలుపుకుని పోవడం ద్వారానే పరిష్కరించారు’ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ‘భారత రత్న అటల్‌-హిందీ, రాష్ట్రవాద్‌ అవుర్‌ సుశాసన్‌’ అంశంపై విశ్వ హిందీ పరిషద్‌ నిర్వహించిన అంతర్‌ రాష్ట్రీయ సమ్మేళనంలో ఆయన శుక్రవారం ప్రసంగించారు. జర్నలిస్టుకు ఉండాల్సిన స్పష్టత, సాహితీ వేత్తకుండాల్సిన సున్నితత్వం, పరిపాలకుడుగా ఉండాల్సిన పారదర్శకత ఉన్నందువల్లే అటల్‌ మంచి నాయకుడుగా రాణించారు.

పార్లమెంట్‌ ఎంత హూందాగా నిర్వహించాలో అటల్జీ నిరూపించారు. ఆయన ఏర్పర్చిన విలువలు నేటికీ ఆదర్శం’ అని వెంకయ్య అన్నారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన ప్రవేశపెట్టేందుకు తాను వాజపేయీని ఏ విధంగా ఒప్పించిందీ ఆయన వివరించారు. విశ్వ హిందీ పరిషద్‌ జాతీయ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ మాట్లాడుతూ, ‘ఒకప్పుడు హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న నేను తర్వాత హిందీ అభిమాని అయ్యాను. అటల్జీ.. భారత దేశం వివిధ భాషలతో కూడిన పుష్పగుచ్ఛంలా భావించారు’ అని అన్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా, మాజీ కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్‌ చోబే, విశ్వ హిందీ పరిషద్‌ జాతీయ కార్యదర్శి డా.విపిన్‌ కుమార్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

శబరిమలై రైళ్లు ఫుల్‌

ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?

Updated Date - Oct 31 , 2026 | 05:21 AM