ఎల్ నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ తాగు నీటి ఏర్పాట్లకు ప్రత్యేక నిధులు: మంత్రి సీతక్క
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:16 PM
ఎల్ నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ తాగు నీటి ఏర్పాట్లకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క వెల్లడించారు. శనివారం హైదరాబాద్లో గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి సరఫరాపై ఇంజినీర్లతో మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్, అక్టోబర్ 31: ఎల్ నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ తాగు నీటి ఏర్పాట్లకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క వెల్లడించారు. శనివారం హైదరాబాద్లో గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి సరఫరాపై ఇంజినీర్లతో మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సింగూరు ప్రత్యామ్నాయ తాగు నీటి అవసరాలకు రూ.120 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ప్రత్యేక నిధులు విడుదల చేస్తామని మంత్రి సీతక్క చెప్పారు. ఇతర జిల్లాల్లో తక్షణ తాగు నీటి అవసరాల కోసం రూ. కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. అలాగే తాగు నీటి సరఫరాలో అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. నీటి ఎద్దడి ప్రాంతాల్లో బోరు బావులను అద్దెకు తీసుకుని.. ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరాకు ఏర్పాట్లు చేయాలని వారికి సూచించారు.
చేతి పంపులు, బావులు, స్థానిక నీటి వనరులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఇంజనీర్లకు మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అలాగే రిజర్వాయర్లలో నీటి నిల్వలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పురోగతిలో ఉన్న ఇంకుడు గుంతలు, మ్యాజిక్ పిట్ (Magic Soak Pit) నిర్మాణాలు రెండు రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఎల్ నినో, నీటి పొదుపుపై గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు మంత్రి సీతక్క వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వల్లభాయ్ పటేల్ దార్శనికత యావత్ జాతికి స్ఫూర్తిదాయకం: సీఎం చంద్రబాబు
వెండి ధరలో భారీ పతనం.. ఒక్కరోజే రూ.10 వేల తగ్గుదల
For More TG News and Telugu News